
మెల్విన్ లూయిస్(ఫొటోలో కుడివైపు ఉన్న వ్యక్తి)
ముంబై: కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మెల్విన్ లూయిస్ క్యాన్సర్ పేషెంట్ల కోసం తన జుట్టును దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను షేర్ చేశారు. "క్యాన్సర్ రోగులకు దానం చేయడం కోసం నా జుట్టును పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాన్ని కత్తిరించే సమయం ఆసన్నమైందని భావించాను. నిజానికి నాకు భుజాల వరకు జుట్టు ఉండటమే ఇష్టం. కానీ దాన్ని ఇంకా పొడవుగా పెంచుకుని.. క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్గుల కోసం దానం చేయవచ్చు కదా అనిపించింది. ఈ క్రమంలో నేను పొడవు జుట్టుతో చేసిన వీడియోలు కొన్ని వైరల్ కూడా అయ్యాయి" (చదవండి: నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త)
"అయితే ఇలా ఎందుకు జుట్టు పెంచుకుంటున్నానన్నది కొందరికే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. 8 ఏళ్ల తర్వాత నేను నా జుట్టును కత్తిరించాను. క్యాన్సర్ మహమ్మారితో పోరాడేవారి కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తాను, వారిపై నా ప్రేమ ఎల్లప్పటికీ ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేయడానికి నన్ను ప్రేరేపించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాగా మెల్విన్ స్నేహితులు చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల కోసం జుట్టును దానం చేశారు. దాన్ని ప్రేరణగా తీసుకునే అతడు ఈ పనికి పూనుకున్నారు. మెల్విన్ చేసిన మంచిపనికి అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారని కీర్తిస్తున్నారు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...)
Comments
Please login to add a commentAdd a comment