
శిరోజాలు దానం చేస్తున్న యువతులు
జూబ్లీహిల్స్: అతివలకు కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంతచెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును కేన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమంది మహిళలు ఆదర్శంగా నిలిచారు. హోప్‌ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లో కేన్సర్ బాధిత మహిళల కోసం హెయిర్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్‌లో పాల్గొన్న పలువురు మహిళలు తమ శిరోజాలను దానం చేశారు. భావన అనే మహిళ తన పూర్తి జుట్టును దానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు హిమజ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి జుట్టును దానం చేసిన భావన
Comments
Please login to add a commentAdd a comment