సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్‌కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment