
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నుంచి ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు బాంద్రాలోని గురునానక్ ఆస్పతిలో చేర్పించారు. శ్వాస సంబంధింద సమస్యలతో బాధపడుతున్న సరోజ్ ఖాన్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్‌గా తేలింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (అతడు కృతజ్ఞత లేని వాడు)
ఇక బాలీవుడ్‌లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో సరోజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇక 1980-90 కాలంలో కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ చిత్రాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసి ఆడియన్స్ చేత డ్యాన్స్‌లు చేయించారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. చివరగా మాధురి నటించిన ‘కలంక్’ చిత్రంలోని కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment