Saroj Khan
-
తెరపైకి ఆమె డ్యాన్స్ కహానీ
బాలీవుడ్ దివంగత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం వెండితెరపైకి రానుంది. సరోజ్ ఖాన్ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ శనివారం వెల్లడించారు. సరోజ్‌ఖాన్ తొలి వర్ధంతి (జూలై 3) సందర్భంగా ఈ బయోపిక్‌ని ప్రకటించారు. ‘‘సరోజ్‌ఖాన్ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో హిందీ సినిమాలో ఓ విప్లవాన్నే తీసుకువచ్చారు. ఆమె కంపోజ్ చేసిన స్టెప్స్‌లో తమ అభిమాన తారల డ్యాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సరోజ్ బయోపిక్కు ఆమె కుమారుడు రాజు ఖాన్, సుఖైనా ఖాన్ సహకరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత భూషణ్ కుమార్. ‘‘మా అమ్మగారి బాటలోనే నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. చిన్నతనం నుంచే అమ్మ ఎన్ని కష్టాలు పడి, ఇండస్ట్రీలో ఎంత ఉన్నత స్థానం సంపాదించిందో నాకు తెలుసు. అమ్మ బయోపిక్ తెరపైకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రాజు ఖాన్. ‘‘ఈ బయోపిక్‌లో అమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నాం’’ అన్నారు సుఖైనా ఖాన్. సరోజ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తారనేది త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు భూషణ్ కుమార్. దాదాపు 3 వేల పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసిన సరోజ్ ఖాన్ మూడు సార్లు జాతీయ అవార్డు సాధించారు. 2020 జూలై 3న గుండెపోటుతో ఆమె మరణించారు. -
సరోజ్ ఖాన్ జీవితంతో సినిమా
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వం వహించ నున్నారు. ఈ నెల 3న సరోజ్ ఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తల్లి బయోపిక్ గురించి ఆమె కుమార్తె సుకైనా నాగ్‌పాల్ ధృవీకరించారు. ‘‘మా అమ్మ మరణానంతరం బయోపిక్ చేస్తామని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. ‘మీ బయోపిక్ తీయాలనుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారు?’ అని అమ్మను గతంలో ఒకసారి అడిగాను. అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం రెమో డిసౌజా. ‘ఓ డ్యాన్స్ మాస్టర్‌గా అతను నా ప్రయాణాన్ని అర్థం చేసుకోగలడు. తను కింది స్థాయి నుంచి పెద్ద దర్శకునిగా ఎదిగాడు’ అని రెమో గురించి అమ్మ చెప్పేవారు. ఆమె బయోపిక్ తీసేందుకు రెమో డిసౌజానే తొలుత మమ్మల్ని సంప్రదిం చారు కూడా. అందుకే అమ్మ బయోపిక్ ఆయన తెరకెక్కిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం’’ అన్నారు సుకైనా. -
‘మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’
బాలీవుడ్ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్యర్య రాయ్, సరోజ్ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ‘తాల్’ సినిమాలోని రామ్తా జోగి షూటింగ్ సెట్లో తీసిన ఫోటోని షేర్ చేశారు. ‘నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నాను. సినీ పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్‌గా మీరు అంటే అందరికి ఎంతో గౌరవం, ఆరాధన, అభిమానం. నిజంగా మీరు లెజెండ్. మీతో నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ గైడెన్స్‌లో డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషంగా భావించేదాన్ని. మీరు మాపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని వేడుకుంటున్నాను’ అంటూ ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్ వేదికగా సరోజ్‌ఖాన్‌కు నివాళులర్పించారు. ఐశ్వర్య కెరీర్లో మైలు రాళ్లుగా నిలిచిన నింబొడ(హమ్ దిల్ దే చుకే సనమ్), డోలా రే డోలా (దేవదాస్), రామ్తా జోగి (తాల్), బార్సో రే (గురు) వంటి పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.(సినీ మువ్వల సివంగి) -
సరోజ్ ఖాన్ మృతి తీరని లోటు: గుణశేఖర్
‘‘ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి భారతీయ సినిమాకే తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘ఓ మారియా.. ఓ మారియా..., అబ్బబ్బా ముద్దు..’ పాటలకు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుణశేఖర్ గుర్తు చేసుకుంటూ– ‘‘1998లో వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమా కోసం సరోజ్ ఖాన్‌గారితో కలిసి పనిచేశా. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటను సరోజ్ ఖాన్‌గారితో చేద్దామనుకుంటున్నానని నిర్మాత అశ్వినీదత్ గారికి చెప్పగానే, నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారు. అప్పటికి ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చిరంజీవిగారి సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ఒప్పుకున్నారామె. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫర్స్ తాలూకు ఎఫర్ట్‌ని తన డ్యాన్స్ మూమెంట్స్‌తో వందరెట్లు ఎక్కువ చేస్తారు. నేను, మణిశర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట వినగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని సరోజ్ ఖాన్‌గారు అడిగారు. మణిశర్మ అనే అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. ఆ రిథమ్స్ నచ్చి, తను భవిష్యత్తులో పెద్ద సంగీత దర్శకుడు అవుతాడన్నారు. పాటల కోసం తోట తరణిగారు వేసిన సెట్‌ని బాగా లైక్ చేశారు. ‘చూడాలని ఉంది’ నా నాలుగో సినిమా. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌గారితో సినిమా అంటే అదొక అచీవ్మెంట్. క్యాస్టింగ్, కెమెరా, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్రద్ధని ఆమె మెచ్చుకొని నన్ను చాలా ప్రోత్సహించారు. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటని మా టీమ్ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ పాటను ప్రేక్షకులు మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాటకి సరోజ్ ఖాన్‌గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా అంతే బాగా క్యాప్చర్ చేస్తారు. దాంతో ‘అబ్బబ్బా ముద్దు..’ పాటను కూడా ఆమెతోనే కొరియోగ్రఫీ చేయించాం. ఆ పాటలో సౌందర్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌కి, చిరంజీవిగారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మరోసారి అంతే గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటికే లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిన సరోజ్ ఖాన్‌గారు కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది’’ అన్నారు. ప్రముఖ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తపరిచారు ► ఒక శకం ముగిసింది. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్తతరం వారికి ఆమె ప్రతిభ ఓ ప్రేరణలా ఉంటుంది. – మహేశ్‌బాబు ► ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ ఇక లేరు. ఆమె నా తొలి కొరియోగ్రాఫర్ (చిరంజీవి ‘డాడీ’లో అల్లు అర్జున్ ఓ డ్యాన్స్ సీక్వెన్స్‌లో కనిపిస్తారు). ఎంతో విలువైన ఓ వజ్రంలాంటి వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది. – అల్లు అర్జున్ ► ఎంతో సునాయాసంగా డ్యాన్స్ చేయగల గొప్ప ప్రతిభావంతురాలు సరోజ్ ఖాన్‌గారు. ‘మేరా పతీ సిర్ఫ్ మేరా హై’ చిత్రంలో ఆమెతో కలిసి పని చేశాను. తన ఊహల్లోని విజువల్స్‌లోకి యాక్టర్స్‌ను తీసుకెళ్లగల ఆమె శైలి గొప్పది. – రాధికా శరత్‌కుమార్ ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను చేసిన, నాకు నచ్చిన, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ఎన్నో పాటల వెనక దాగి ఉన్న ఓ లెజెండ్ సరోజ్ మేడమ్. ఇండస్ట్రీకి ఆమె చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది. – వేదిక ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త విని నా హృదయం బద్దలైంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. – తమన్నా ► సరోజ్‌ఖాన్ జీతో కలిసి పనిచేయడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాను. – ప్రియమణి ► సినిమాలోని పాత్ర కోసం ఒక డ్యాన్సర్‌గా డ్యాన్స్‌లో మునిగి ఎలా మైమరచిపోవాలో నాకు గంటలకొద్దీ పాఠాలు చెప్పారామె. సినిమా పరిశ్రమలో నా తొలి గురువు సరోజ్ ఖాన్. నన్నెంతో ప్రేమగా చూసుకున్న ఆమె నాకెంతో ప్రత్యేకం. ఆమె ఆత్మకు అల్లా దీవెనలు ఉండాలి. – షారుక్ ఖాన్ ► సరోజ్ ఖాన్ మనతో లేరనే చేదు వార్తతో శుక్రవారం నిద్రలేచాను. ఆమె శిక్షణలో చాలా ఈజీగా ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చని నిరూపించారు. సరోజ్ ఖాన్ మరణం బాలీవుడ్ చిత్రపరిశ్రమకు తీరని లోటు. – అక్షయ్‌కుమార్ ► ఒక చరిత్ర అంతరించిపోయింది. సరోజ్ ఖాన్ మరణం వ్యక్తిగతంగా నాకు చాలా పెద్ద నష్టం. మన ముక్తా ఆర్ట్స్ (సుభాష్ నిర్మాణ సంస్థ) ఫ్యామిలీ అంతా నువ్వే ఉన్నావు. మాధురీ దీక్షిత్, మీనాక్షీ శేషాద్రి, మనీషా కొయిరాల, ఐశ్వర్యా రాయ్‌లు స్టార్స్‌గా ఎదగటానికి నాతో పాటు నువ్వు ఎప్పుడూ ఉన్నావు. డ్యాన్స్ ఉన్నంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమలో బతికే ఉంటావు. – సుభాష్ ఘాయ్ ► సరోజ్‌జీ.. నాతో పాటు ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పరిశ్రమలోకి వచ్చాం. మీ డ్యాన్స్ నైపుణ్యానికి అభినందనలు. – ఫరాఖాన్ ► నిద్ర లేవటంతోనే ఇంతటి హృదయవిదారకమైన బాధను మోయాల్సి వస్తుందనుకోలేదు. మీ మరణవార్త విని తట్టుకోలేకపోయాను. మీకు మీరే ఒక శిక్షణాలయం లాంటివారు. మన డ్యాన్సర్స్ అందరికీ మీ మరణం చాలా పెద్ద లాస్. మీ శిష్యుల్లో ఒకడిగా, మీతోపాటు డ్యాన్సర్‌గా, మీతో కొరియోగ్రాఫర్‌గా, మీరు కొరియోగ్రాఫర్‌గా నేను డైరెక్టర్‌గా మిమ్మల్ని డైరెక్ట్ చేయటం.. ఇవన్నీ నా జీవితంలో జరిగిన అద్భుతాలు. డ్యాన్స్ చేసేటప్పుడు మీ కళ్లల్లో కనబడిన మెరుపు వృత్తిపట్ల మీకున్న ప్రేమను తెలియజేసేది. మీ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అందుకే మిమ్మల్ని, మీ జ్ఞాపకాలను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. – రెమో డిసౌజా ► డ్యాన్స్‌లో నా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించటానికి నాకెంతో సాయం చేసిన సరోజ్ ఖాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఓ అగ్రశ్రేణి ప్రతిభాశాలిని భారతీయ సినిమా పరిశ్రమ కోల్పోయింది. – మాధురీ దీక్షిత్ ► మీతో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. అది నా అదృష్టం. మీరు లేని లోటుని భర్తీ చేసే బలాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – జెనీలియా ► మీ డ్యాన్స్ డైరెక్షన్లో డ్యాన్స్ చేయటం ప్రతి ఒక్క నటి కల. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాను సరోజ్‌జీ. – కాజల్ అగర్వాల్ ► ‘చూడమ్మా.. నీకేం కావాలో అది సాధించాలంటే దాని మీద దృష్టి సారించి నీ ప్రతిభను మొత్తం ప్రదర్శించు’’ అని ఓ సందర్భంలో మీరు (సరోజ్ ఖాన్) నాతో అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – హన్సిక ► దేవుడా.. ఈ ఏడాది ఇక ఏ విషాద వార్తనూ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. మీ కొరియోగ్రఫీలో ఒక్క పాట అయినా చెయ్యాలని కలలు కనేదాన్ని. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – రకుల్‌ప్రీత్ సింగ్ -
‘మాస్టర్ జీ’ మరి లేరు
బాలీవుడ్ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. ఆమె అసలు పేరు నిర్మల నాగ్‌పాల్. ఇండస్ట్రీలో సరోజ్ ఖాన్‌గా గుర్తింపు పొందారు. జూన్ 20న ఆమెకు శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే బాంద్రాలోని గురునానక్ హాస్పిటల్లో చేర్చారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే సుదీర్ఘకాలంగా ఆమె డయాబెటిస్ పేషెంట్ కావడం చేత ఇతర వయసు సంబంధ సమస్యల రీత్యా హాస్పిటల్లోనే ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా హఠాత్తుగా వచ్చిన గుండెపోటు వల్ల మరణించినట్టు ఆస్పత్రివర్గాలు చెప్పాయి. ఆమె ఖననం శుక్రవారమే ముగిసిందని ఆమె మేనల్లుడు మనిష్ జగ్వాని తెలియచేశాడు. సరోజ్ ఖాన్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దాదాపు 2000 పాటలకు కొరియోగ్రాఫ్ చేశారు. వైజయంతీ మాల, వహీదా రహెమాన్లు మొదలు శ్రీదేవి, మాధురి దీక్షిత్, కరీనా కపూర్ వరకు ఎందరో తారలు ఆమె నాట్యరీతుల వల్ల పేరు తెచ్చుకున్నారు. మూడుసార్లు జాతీయ పురస్కారం పొందారు. ఫిల్మ్‌ఫేర్‌లో హ్యాట్రిక్ కొట్టిన ఏకైక కొరియోగ్రాఫర్ ఆమె. చిరంజీవి హిందీ సినిమా ‘జంటిల్మేన్’, రామ్ గోపాల్ వర్మ ‘రంగీలా’ సినిమాలకు సరోజ్‌ఖాన్ నృత్యరీతులు అందించారు. డాన్స్ ఏమాత్రం చేయలేని సంజయ్ దత్‌కు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ‘తమ్మా తమ్మా దేదే’ హిట్ ఇచ్చిన గురువు ఆమె. సరోజ్ ఖాన్ తన నాట్యగురువు సోహన్‌లాల్‌ను తన 13వ ఏట వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 41. ఆ వివాహం నిలువలేదు. ఆ తర్వాత సర్దార్ రోషన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు రాజు ఖాన్ బాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు. -
సినీ మువ్వల సివంగి
‘ఏక్ దో తీన్.. చార్ పాంచ్ ఛే సాత్’.... ‘తేజాబ్’కు ఆ పాట కలెక్షన్ల వరద సృష్టించింది. ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’... ‘మిస్టర్ ఇండియా’ ఈ పాటతో శ్రీదేవిని టాప్ చైర్ మీద కూచోబెట్టింది. ‘నింబొడ నింబొడ నింబొడ’... ఏంటి.. ఐశ్వర్యా రాయ్ ఇంత బాగా డాన్స్ చేస్తుందా అనిపించింది. ‘ఏ కాలే కాలే ఆంఖే’... షారూక్‌ఖాన్ ఆమె ఆడమన్నట్టు ఆడాడు. ‘రాధా క్యూ న జలే’ ఆమిర్‌ఖాన్ ఆమె చెప్పినట్టు గెంతాడు. సరోజ్ ఖాన్. బాలీవుడ్‌ను సుదీర్ఘకాలం ఏలిన ఏకైక మహిళా కొరియోగ్రాఫర్. ప్రభుదేవా, లారెన్స్, ఫర్హా ఖాన్ల జేజమ్మ. మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇన్ ఇండియా. సరోజ్ ఖాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు గోడ మీద తన నీడను చూస్తూ డాన్స్ చేసేది. తల్లి అది చూసి భయపడింది. కూతురు పుట్టిందనుకుంటే పిచ్చి పిల్ల పుట్టిందేమిటా అని ఆఘమేఘాల మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘ఇది పిచ్చేగాని డాన్స్ పిచ్చి. మీ పాపను చైల్డ్ ఆర్డిస్టును చేయండి. ఎలాగూ మీకు డబ్బులు అవసరం కదా’ అన్నాడు తెలిసిన డాక్టరు. అప్పటికి ముంబైలో నిరుపేద చాల్లో ఉంటున్న ఆ కుటుంబంలోని వారికి ఈ మాటలు నచ్చాయి. సరోజ్ ఖాన్‌కు ఐదారేళ్లు వచ్చేటప్పటికి చైల్డ్ ఆర్టిస్టును చేశారు. నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత వేషాలు రాలేదు. సరోజ్ ఖాన్‌కు పదేళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తన తర్వాత ఇంకా నలుగురు తోబుట్టువులున్నారు. తల్లికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని తనే నిలబెట్టాలి. సరోజ్ ఖాన్ గ్రూప్ డాన్సర్ అయ్యింది. హీరో హీరోయిన్ల వెనుక పరిగెత్తే పది మందిలో ఒకత్తి అయ్యింది. తిండికి ఎలాగో గడుస్తుంది. కాని ఇది చాలదు. ‘ఏక్ దో తీన్’ పాటలో మాధురీ దీక్షిత్ గురు పరిచయం అప్పటికి డాన్స్ మాస్టర్ బి.సోహన్‌లాల్ (సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ హీరాలాల్ పెద్దన్న) మద్రాసు (చెన్నై)లో పని చేస్తూ అప్పుడప్పుడు బాంబే (ముంబై) వచ్చి పాటలు చేసేవాడు. అతను గ్రూప్డాన్సర్స్లో చురుగ్గా ఉంటున్న సరోజ్ ఖాన్‌ను గమనించాడు. ఒకరోజు సెట్లో సరోజ్ ఖాన్ హెలెన్‌ను అనుకరిస్తూ స్టెప్స్ వేస్తుంటే ‘ఏదీ మొత్తం పాటకు చేసి చూపించు’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ తొణక్కుండా అచ్చు హెలెన్లాగే డాన్స్ చేసి చూపించింది. అప్పటి దాకా సోహన్లాల్కు అసిస్టెంట్లు లేరు. పదమూడేళ్ల వయసున్న సరోజ్ ఖాన్‌ను అతడు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఆయనే ఆమెను తీర్చిదిద్దాడు. సోహన్‌లాల్ యూరప్‌కు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన చేయాల్సిన పాటను 13 ఏళ్ల వయసులో సరోజ్ కొరియోగ్రాఫ్ చేసింది. ఆ సినిమా ‘దిల్ హి తో హై’ (1963). అందులో రాజ్ కపూర్ హీరో. నూతన్ హీరోయిన్. వాళ్లిద్దరి మీద పాట– ‘నిగాహే మిలానే కో జీ చాహ్ తాహై’. కాని సరోజ్ ఖాన్ తొట్రు పడలేదు. చేసింది. ప్రయాణం మొదలైంది. ధక్ ధక్ కర్నే లగా’లో మాధురీ, అనిల్‌కపూర్ మగ ప్రపంచం సినిమా ప్రపంచం అంటే మగ ప్రపంచం. మగవారు పెత్తనం చేసే ప్రపంచం. సరోజ్ ఖాన్‌కు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత బాగా పాటలు చేస్తున్నా గుర్తింపు ఇచ్చేవారు కాదు. అసలు టైటిల్స్‌లో పేరే ఉండేది కాదు. ఒకసారి షూటింగ్లో ఉంటే సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆమెను గమనించి పిలిచాడు. ‘నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా. నీ పేరు స్క్రీన్ మీద ఎందుకు వేయరు?’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ మౌనంగా ఉండిపోయింది. సరే.. ఈ సినిమాలో నీ పేరు వేయిస్తాను అని చెప్పి వేయించాడు. అలా ‘ఇంక్విలాబ్ కీ ఆగ్’ అనే సినిమాలో సరోజ్ ఖాన్ పేరు మొదటిసారిగా పడింది. కాని అప్పటికీ గుర్తింపు రాలేదు. సుభాష్ ఘాయ్ ‘హీరో’ (1983) సినిమాలో సరోజ్ ఖాన్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ‘హీరో’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుభాష్ ఘాయ్ తీసుకున్నాడంటే ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది అని మిగిలిన నిర్మాత, దర్శకులు అనుకుని ఆమెను పిలవడం మొదలెట్టారు. టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. సుభాష్ ఘాయ్ లైట్ వేశాడంతే. ‘డోలారే డోలారే’లో మాధురీ, ఐశ్వర్యరాయ్ ఏక్.. దో... తీన్... ఎన్.చంద్ర ‘తేజాబ్’ (1988) తీశాడు. అందులో మాధురి దీక్షిత్ అనే కొత్త హీరోయిన్ని తీసుకున్నాడు. ఆమెకు ఒక మంచి పాట పెట్టాడు. ‘ఈ పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలో ఉండకూడదు. అంతే మీకు నేను చెప్పేది’ అన్నాడు సరోజ్‌ఖాన్‌తో. సరోజ్ ఖాన్ ఈ పాటను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. మాధురి దీక్షిత్‌కు ఉన్న డాన్స్ టాలెంట్‌ను ఉపయోగించుకుంది. ‘ఏక్.. దో... తీన్.. చార్.. పాంచ్’... పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది. జనం సినిమా కోసం ఒకసారి, ఈ పాట కోసం ఒకసారి థియేటర్లకు వచ్చారు. మాధురి దీక్షిత్ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యింది. ఫిల్మ్‌ఫేర్ వాళ్లు అప్పటివరకు కొరియోగ్రాఫర్‌కు అవార్డ్ పెట్టనేలేదు. ఈ సినిమా వచ్చాక ఆ అవార్డును ఇంట్రడ్యూస్ చేసి సగౌరవంగా సరోజ్ ఖాన్‌కు తొలి అవార్డు ఇప్పించారు. సరోజ్ ఖాన్ దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నీ తలెత్తి చూసే కొరియోగ్రాఫర్ అయ్యిందిప్పుడు. హిట్ల వరుస సరోజ్ ఖాన్ అక్షరాభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేహ కవళికలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యం. వాటికోసం నటీ నటులను సానపెడుతుంది. అందుకే ఆ పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో శ్రీదేవి సరైన హిట్ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్ ఇండియాలో’ నీలిరంగు చీర కట్టుకుని ఆమె వేసిన ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’ పాట స్టెప్పులు ఆమెకు భారీ ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. అదే సినిమాలోని ‘హవా హవాయి’ కూడా శ్రీదేవి మరణించే వరకు ప్రస్తావనకు వస్తూనే ఉండేది. వీటిని చేయించింది సరోజ్ ఖాన్. ‘చాందినీ’లో శ్రీదేవి చేసిన ‘మేరే హాతో మే నౌనౌ చూడియా’ పాట ఆ ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక మాధురి దీక్షిత్‌తో సరోజ్ ఖాన్ హిట్స్‌కు లెక్కే లేదు. ‘బేటా’లో ‘ధక్ ధక్ కర్ నే లగా’, ఖల్ నాయక్‌లో ‘చోళీ కే పీఛే క్యా హై’, యారానాలో ‘మేరా పియా ఘర్ ఆయా’... చాలా పెద్ద హిట్లు. ఇక సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ చేసిన ‘డోల రే డోలరే’ పాట సరోజ్ ఖాన్ ప్రతిభకు పతాక. శ్రీదేవితో... జాతీయ పురస్కారం సరోజ్ ఖాన్ అంటే ఎద విరుపులు, కటి కుదుపులు అనుకునే వారు కొందరు ఉండొచ్చు. కాని ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని గౌరవించడమే తెలిసిన ప్రతిభాశాలి. దానికి నూరుశాతం న్యాయం చేయడం బాధ్యత అనుకుంటుంది. అయితే తమిళంలో వచ్చిన ‘శ్రింగారం’ (2005) అనే సినిమాకు ఆమె సమకూర్చిన భరతనాట్య నృత్యరీతులు ఆమెకు జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. చెన్నైలోని సనాతన నృత్య సంస్థ ‘శ్రీకృష్ణ గానసభ’ ఆ సినిమాలో ఆమె చూపిన ప్రతిభను గౌరవించి మొదటిసారిగా ఒక సినిమా కొరియాగ్రాఫర్ని– సరోజ్ ఖాన్ని– పిలిచి సత్కరించుకుంది. అదీ సరోజ్ ఖాన్ ప్రతిభ. ముగింపు సరోజ్‌ఖాన్ స్థూలకాయురాలు. కాని ఆమె డాన్స్ చేయడం మొదలెడితే ఆ దేహం విల్లులా వొంగేది. ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా ఆమె నృత్యం మానలేదు. ఆపలేదు. ఎందరో శిష్యులను సినిమా రంగానికి ఇచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మూడేళ్ల వయసు నుంచి నర్తిస్తున్న ఆమె పాదాలు 71వ ఏట శాశ్వత విశ్రాంతిని తీసుకున్నాయి. కాని భారతీయ వెండితెర మీద ఆమె వేసిన పాదముద్రలు మాత్రం బహుకాలం సజీవంగా ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ -
‘సినిమా ఆఫర్లు లేవు.. సల్మాన్ మాటిచ్చాడు’
ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె తీవ్రమైన గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక సరోజ్ ఖాన్ హఠాన్మరణంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. నృత్య దర్శకురాలికి సెలబ్రిటీలంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. సరోజ్ ఖాన్ తన 14 ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టగా, దిల్ హి తో హై(1963) సినిమాలోని ‘నిగహీన్ మిలాన్ కో జీ చహహ్తా’ పాటకు మొదట కొరియోగగ్రాఫ్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రాఫ్ చేసి ఎంతో మంది ప్రశంసలు పొందారు. (సరోజ్ ఖాన్ చివరి పోస్ట్ అతడి గురించే) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని వెల్లడించారు. ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సరోజ్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘నేను సల్మాన్‌ను కలిసినప్పుడు ఏం చేస్తున్నానని అడిగాడు. సినిమా ఆఫర్లు ఏమి లేవని నిజాయితీగా సమాధానమిచ్చాను. కేవలం యువ హీరోయిన్లకు భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నాని తెలిపాను. అది విన్న వెంటనే సల్మాన్ నాతో కలిసి పనిచేస్తానని, నా కొరియోగ్రఫీలో తను డ్యాన్స్ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన మాటకు సల్మాన్ కట్టుబడి ఉంటాడని నాకు తెలుసు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు’ అని సరోజ్ ఖాన్ పేర్కొన్నారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) నాలుగు దశాబ్దాల కెరీర్లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు మూడు జాతీయ అవార్డులు వరించాయి. ఎనిమిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. చివరిసారిగా గతేడాది విడుదలైన మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్’ చిత్రంలోని ‘తబా హో గయే’ పాటకు కొరియోగ్రఫీ అందించారు. (బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త) -
సరోజ్ ఖాన్ చివరి పోస్ట్ అతడి గురించే
ముంబై: దాదాపు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ హిట్ చిత్రాలకు నృత్య దర్శకురాలిగా పనిచేసిన ‘మాస్టర్జీ’ సరోజ్ ఖాన్(72) శుక్రవారం ఉదయం గండెపోటుతో కన్నుమూశారు. ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’గా కీర్తింపబడే సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరో పెద్దదిక్కును కోల్పోయామని, ఆమె మరణం తీరని లోటని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు. సరోజ్ మరణం అనంతరం ఆమె సోషల్ మీడియాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 14న యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై భావోద్వేగ పోస్ట్ చేశారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) ‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ చాలాసార్లు కలుసుకున్నాం. నేను మీ అన్ని చిత్రాలను చూశాను. మీరన్నా, మీ చిత్రాలన్నా నాకెంతో ఇష్టం. అయితే మీ జీవితంలో ఏం పొరపాటు జరిగింది? మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర షాక్‌కు గుర్యయ్యాను. నీ కష్టాలను, బాధలను పెద్దవాళ్లతో పంచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎంటో నాకు తెలియదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానభూతి తెలుపుతున్నాను’ అంటూ సుశాంత్ మృతి పట్ల సరోజ్ ఖాన్ తన సంతాపం తెలిపారు. (బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త) కాగా 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫి అందించిన సరోజ్ ఖాన్ చివరగా 2019లో కరణ్ జోహర్ తెరకెక్కించిన ‘కళంక్’ సినిమాకు పనిచేశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారి మంచి గుర్తింపు పొందారు. మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిన ‘తేజాబ్’ చిత్రంలోని ‘ఏక్.. దో.. తీన్’ పాటకు సరోజ్ ఖానే కొరియోగ్రఫీ చేశారు. హిందీలో వచ్చిన దేవదాస్ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు 2003లో, శృంగారం సినిమాలోని అన్ని పాటలకు 2006లో, ‘జబ్ వి మెట్’లోని ‘యే ఇష్క్ హాయే’ గీతానికి 2008లో.. అమె జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు దక్కించుకున్నారు. View this post on Instagram I had never worked with you @sushantsinghrajput but we have meet many times. What went wrong in your LIFE?I'm shocked that you took such a drastic step in your LIFE. You could have spoken to an Elder which could have helped YOU and would have kept us Happy looking at YOU. God bless your soul and I don't know what your Father and Sister's are going through. Condolences and Strength to them to go through this Time. I Loved you in all your Movies and will always Love you. R.I.P🙏🙏 A post shared by Saroj Khan (@sarojkhanofficial) on Jun 14, 2020 at 7:27am PDT -
ఆగిన ఏక్..దో..తీన్
-
బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త
ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్(72) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బాంద్రాలోని గురునానక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమె మరణం బాలీవుడ్‌ను దిగ్బ్రాంతికి గురిచేసింది. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) ‘ఉదయం లేవగానే దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇక లేరనే విషాదకర వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యాను. అమె కొరియోగ్రాఫీలో డ్యాన్స్ చేయడం చాలా సులభం. ఎవరితోనైనా డ్యాన్స్ చేయించగలరు. సరోజ్ ఖాన్ మరణంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. అమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘మనందరికి శాశ్వత గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు సరోజ్ ఖాన్. మనిషి కేవలం శరీరంతోనే కాదు హృదయంతో మరియు ఆత్మతో నృత్యం చేస్తాడు అని నృత్య కళాకారులకు మాత్రమే కాకుండా యావత్ దేశానికి చాలా అందంగా నేర్పించారు. ఆమె మరణం వ్యక్తిగతంతో ఎంతో తీరని లోటు. ఆమె తియ్యటి తిట్లను కూడా మిస్సవుతాను’ అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ‘ఉదయం లేవవగానే గుండె పగిలిపోయే విషాదకర వార్త విన్నాను. మీ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ముఖ్యంగా మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని కొరియోగ్రాఫర్లుగా మారిన నా లాంటి ఎంతో మందికి ఇది ఎంతో విషాదకర వార్త. మీతో కలిసి డ్యాన్స్ చేయడం, కొరియోగ్రాఫీలో డ్యాన్స్ చేయడం, మీతో కలిసి కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన క్షణాల మరిచిపోలేనివి. డ్యాన్స్‌పై మీకున్న ప్రేమ, అభిరుచి, ప్రతీ పాటకు మీరు కొరియోగ్రాఫీ చేసే విధానం ఎంతో మందికి స్పూర్తి. ఇలాంటి విషయాలు మాకు ఎన్నో నేర్పించినందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచిపోతారు. సరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘దిగ్గజ కొరియోగ్రాఫర్, మూడు సార్లు జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్ (72) మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆమె కొరియోగ్రాఫీ చేసిన 2000కు పైగా పాటలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విషాద సమయంలో సరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని సరోజ్ ఖాన్ మృతిపట్ల మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. डान्स की मल्लिका #सरोजखान जी अलविदा।आपने कलाकारों को ही नहीं बल्कि पूरे हिन्दुस्तान को बहुत ख़ूबसूरती से सिखाया कि “इन्सान शरीर से नहीं, दिल और आत्मा से नाचता है”।आपके जाने से नृत्य की एक लय डगमगा जाएगी। मैं पर्सनली ना सिर्फ़ आपको बल्कि आपकी मीठी डांट को भी बहुत मिस करूँगा।🙏😥 — Anupam Kher (@AnupamPKher) July 3, 2020 Woke up to the sad news that legendary choreographer #SarojKhan ji is no more. She made dance look easy almost like anybody can dance, a huge loss for the industry. May her soul rest in peace 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) July 3, 2020 -
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
-
ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత
సాక్షి, ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. గత నెల (జూన్) 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఖాన్ ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. పరిస్థితి మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. సరోజ్ ఖాన్ హఠాన్మరణం బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. నాలుగు దశాబ్దాల కెరీర్లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన ఘనత ఖాన్ సొంతం. దివంగత నటి శ్రీదేవి సూపర్ హిట్ మూవీ నాగిని, మిస్టర్ ఇండియాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని డోలా రే డోలా, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్ నుండి ఏక్ దో టీన్, 2007లో జబ్ వి మెట్ నుండి యే ఇష్క్ హాయేతో సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులను ఖాన్ గెల్చుకున్నారు. 1948 నవంబరు 22న సరోజ్ ఖాన్ జన్మించారు. బాలీవుడ్ మాస్టర్జీగా పాపులర్ అయిన సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్ . ఆమెకు భర్త సోహన్ లాల్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
సీనియర్ కొరియోగ్రాఫర్‌కు కరోనా పరీక్షలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నుంచి ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు బాంద్రాలోని గురునానక్ ఆస్పతిలో చేర్పించారు. శ్వాస సంబంధింద సమస్యలతో బాధపడుతున్న సరోజ్ ఖాన్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్‌గా తేలింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (అతడు కృతజ్ఞత లేని వాడు) ఇక బాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో సరోజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇక 1980-90 కాలంలో కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ చిత్రాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసి ఆడియన్స్ చేత డ్యాన్స్‌లు చేయించారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. చివరగా మాధురి నటించిన ‘కలంక్’ చిత్రంలోని కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు) -
‘సల్మాన్ చాన్స్ ఇస్తా అన్నాడు’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా వివాదాలతో ఎలా వార్తల్లో నిలుస్తుంటారో, అదే స్థాయిలో తన మంచి మనసును కూడా చాటుకుంటుంటాడు సల్లూభాయ్. గతంలో చాల మంది నటులకు సాయం చేసిన సల్మాన్ తాజాగా లెజెండరీ కొరియోగ్రాఫర్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 2015లో రిలీజ్ అయిన తనూ వెడ్స్ మను తరువాత చాలా కాలం సినిమాలకు దూరమైన సరోజ్ ఖాన్ ఇటీవల మణికర్ణిక, కలంక్ సినిమాకు పని చేశారు. ప్రస్తుతం ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల సల్మాన్ ను కలిసి సరోజ్ ఖాన్ ఇదే విషయాన్ని సల్మాన్‌తో ప్రస్థావించటంతో త్వరలో మనం కలిసి పని చేద్దాం అంటూ మాట ఇచ్చారట. ఈ విషయాన్ని సరోజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘చాలా కాలం తరువాత సల్మాన్‌ను కలవటం ఆనందంగా ఉంది. నీకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉంటాయి’ అంటూ కామెంట్ చేశారు సరోజ్ ఖాన్. View this post on Instagram It was a pleasure meeting you after so long @beingsalmankhan ! God bless you always my darling! ❣️ A post shared by Saroj Khan (@sarojkhanofficial) on Mar 28, 2019 at 4:35am PDT -
నటి ఆశ్చర్యకర సమాధానం
సిని పరిశ్రమలో కలకలం రేపిన ‘కాస్టింగ్ కౌచ్’ గురించి పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించగా...రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు తమకు అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌ను అడగ్గా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ‘ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బాగా వెలుగులోకి వచ్చింది. అయితే నా ఉద్దేశ్యం ప్రకారం ఇలాంటి అంశాల గురించి చర్చిస్తే పరిశ్రమ గురించి ప్రజలకు ప్రతికూల భావాలను రేకెత్తించిన వారమవుతాం. అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు’ అని తెలిపారు. అంతేకాక ‘జీవానాధరం కోసం కష్టపడే యువతీ, యువకులందరికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వారి పనులు జరిపించుకోవాలని చూస్తారు. అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు తారసపడినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని తెలిపారు. ప్రస్తుతం అలియా నటించిన రాజీ సినమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడతున్న సంగతి తెలిసిందే -
ఔను క్యాస్టింగ్ కౌచ్ ఉంది: నటుడు
ముంబై : సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తుండటంపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌కు పలువురు వ్యతిరేకంగా గళమెత్తుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ తప్పేమీ కాదని, అది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోందని ఆమె సమర్థించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని, పార్లమెంటులోనే ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. రాజకీయ, వినోద రంగాల్లో లైంగిక లబ్ధులు ఇచ్చిపుచ్చుకోవడం, డిమాండ్ చేయడం సాధారణమేనని అన్నారు. ‘సరోజ్ ఖాన్ కానీ, రేణుకా చౌదరికానీ తప్పు కాదు. లైంగిక లబ్ధులు డిమాండ్ చేయడం, ఇవ్వడం వినోద, రాజకీయ రంగాల్లో ఉన్నదే. ఇది పాత విధానం. కాలపరీక్ష నిలబడిన విధానం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పదు. నువ్వు నన్ను.. నేను నిన్ను సంతృప్తి పరచే విధానం. చాలాకాలం నుంచి ఇది జరుగుతూ వస్తున్నదే. ఇందులో అంత బాధపడాల్సింది ఏముంది’ అని ఆయన అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొరియోగ్రఫీ రంగంలో ఆమె చేసిన సేవలు నిరూపమానమైనవని, రేఖ, మాధూరీ దీక్షిత్, దివంగత శ్రీదేవి కెరీర్లోను మలచడంలో ఆమె పాత్ర మరువలేనిదని, తన రంగంలో ఆమె లెజెండ్ అని శత్రుఘ్న పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉనికి లేదని తాను అనడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘సరోజ్, రేణుకా వ్యాఖ్యలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తాను. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా రాజీపడతారో నాకు తెలుసు. సరోజ్ కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు, వేదనలు ఎదుర్కొని ఉంటారు. ఇక రాజకీయాల్లో ఉన్నదానిని క్యాస్టింగ్ వోట్ కౌచ్ అనాలేమో.. ఎదగాలనుకుంటున్న యువతులు.. సీనియర్ నేతలకు లైంగిక లబ్ధులను ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. వారి అంగీకరిస్తూ ఉండొచ్చు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘అయితే ఈ సంస్కృతి సరైనదని నేను అనడం లేదు. అలాంటి రాజీ పడే పనులు నేను ఎన్నడూ చేయలేదు. కానీ చుట్టూ జరుగుతున్న దానిని చూడకుండా ఉండలేదం కదా. నిజాన్ని మాట్లాడినందుకు సరోజ్‌ను ఖండించకండి’ అని శత్రుఘ్న పేర్కొన్నారు. -
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తే వాళ్లను తక్కువ చేయడమే
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ ‘‘క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉంది. కేవలం సినీ పరిశ్రమను ఎందుకు నిందిస్తారు? ఇండస్ట్రీ కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది. మిగతా చోట్లల్లా మహిళలను వాడుకొని వదిలేయడం లేదు కదా?’’ అని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సరోజ్ ఖాన్ చేసిన ఈ కామెంట్ కరెక్టేనా? అన్న ప్రశ్నను కమల్ హాసన్ ముందుంచితే ఆయన స్పందిస్తూ– ‘‘నేను ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాస్టింగ్ కౌచ్ మీద కూర్చోవాలా వద్దా? లేకపోతే ఆ కౌచ్‌ని కాళ్లతో తన్నేయాలా అన్నది పూర్తిగా ఆ మహిళ రైట్. కానీ క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ దానికి ఫేవర్‌గా మాట్లాడితే ఇండస్ట్రీలో ఉన్న నా చెల్లెళ్లు, కూతుళ్ల రైట్స్‌ను తగ్గించటమే. వాళ్లను తక్కువ చేయడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. -
‘క్యాస్టింగ్ కౌచ్‌కి అనుకూలంగా మాట్లాడలేదు’
ముంబై : శ్రీరెడ్డి అర్దనగ్న నిరసన తర్వాత కాస్టింగ్ కౌచ్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్ధించేలా సరోజ్ ఖాన్ మాట్లాడరనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందని సమర్ధిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యాలను ఆమె సమర్ధించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో కూడా దుష్ప్రవర్తనకు పాల్పడేవారున్నారు. ఇది అన్ని రంగాల్లోను ఉందని, బాలీవుడ్‌ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇదే అంశంపై ట్విటర్లో కూడా ఆమె స్పందించారు. ‘నేను కూడా సరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె క్యాస్టింగ్ కౌచ్‌కి మద్దతుగా మాట్లాడారని అనుకోవడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు అలా చూస్తారని ఆమె ప్రశ్నించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రేప్ అనే పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది అసహ్యకరమైన చర్య, దీని నివారణకు చర్యలు తీసుకోవాల’ని రిచా చద్దా అన్నారు. -
‘కాస్టింగ్ కౌచ్’పై సరోజ్ ఖాన్ భిన్నస్పందన
-
సమాజంలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది
-
నిర్మాతలకు బానిసలుగా ఉండాలా?: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సినీ పరిశ్రమలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిని సమర్థిస్తూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ సమర్థనీయమని, ఇది వర్థమాన నటీమణులకు జీవనోపాధి కల్పిస్తుందని, పరస్పర సమ్మతితోనే మహిళలు శృంగారంలో పాల్గొంటారని, ఇందులో లైంగిక వేధింపులు, మహిళలను మోసం చేయడం వంటిది ఉండదని ఆమె పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తుతున్న నటి శ్రీరెడ్డి సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ ఈ వ్యాఖ్యలతో సరోజ్ ఖాన్‌పై గౌరవం పోయింది. సినీ పెద్ద అయిన ఆమె వర్థమాన నటీమణులకు మంచి దారిని చూపాలి. కానీ, నిర్మాతలకు బానిసలుగా ఉండాలంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చే వ్యాఖ్యలు చేశారు’ అని శ్రీరెడ్డి ఏఎన్ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. నటి, మోడల్ సోఫీ చౌదరి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కొరియోగ్రాఫర్‌గా సరోజ్ఖాన్పై చాలా గౌరవం ఉంది. కానీ ఆమె తన హోదాతో ఇలాగేనా అమ్మాయిలను కాపాడేది? నేను ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం నుంచి రాకుంటే.. ముంబైకి వచ్చిన నెలరోజులకే లండన్ తిరగి వెళ్లిపోయేదాన్ని. ఇండస్ట్రీలో పరిస్థితులు అలా ఉన్నాయి’ అనిఆమె పేర్కొన్నారు. ‘తమ కలలను నిజం చేసుకోవడానికి అమ్మాయిలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆలోచిస్తే.. ఎంతో కష్టంగా తోస్తుంది. పని కోసం ముక్కు మొఖం తెలియనివారితో శారీకరంగా గడపాలని ఎవరూ కోరుకోరు. కానీ, ఇది ఒక్కటే మార్గం, అలా చేయకుంటే ముందుకు వెళ్లడం చాలా కష్టమనే భావనను కల్పిస్తున్నారు. దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ సోఫీ ట్వీట్ చేశారు. Can’t begin to think what thousands of girls go through in the hope that their “dreams” will come true! Nobody wants to sleep with someone for work. But they are made to feel it’s the only way & “acceptable”. And for those who don’t, it’s a tough road! This has to stop! #TimesUp — Sophie Choudry (@Sophie_Choudry) April 24, 2018 -
పార్లమెంట్‌లోనూ కాస్టింగ్ కౌచ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక దోపిడీ(కాస్టింగ్ కౌచ్) ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదని, పార్లమెంటూ దానికి మినహాయింపు కాదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మాదిరిగా ‘మీ టూ’ అని ఇండియా కూడా నినదించాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌కు మద్దతుగా నిలవడంపై రేణుక మంగళవారం ఉదయం పై విధంగా స్పందించారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సాయంత్రం వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తనని అవమానించడం కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుందని పేర్కొన్నారు. ‘కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు పరిమితం కాలేదనేది ఒక చేదు నిజం. అన్ని పని ప్రదేశాల్లోనూ ఇది సాధారణమే. పార్లమెంటు కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు అని భావించొద్దు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీమణులు కాస్టింగ్ కౌచ్‌పై ‘మీ టూ’ అంటూ తమపై జరిగిన అఘాయిత్యాలను బహిర్గతం చేస్తున్నారు. భారత్‌లో కూడా బాధితులు అలాగే గొంతెత్తాలి’ అని అన్నారు. పార్లమెంటులో కాస్టింగ్ కౌచ్ ఉందనడం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో రేణుక తిరిగి సాయంత్రం వివరణ ఇచ్చారు. ‘గత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ సభ్యురాలైన నన్ను ప్రధాని నరేంద్ర మోదీ శూర్పణఖతో పోల్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నా గౌరవానికి భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఒక మహిళగా నా హక్కులు, గౌరవానికి భంగం కలిగించారు కాబట్టి ఇది కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుంది’ అని రేణుక వివరణ ఇచ్చారు. వారికి ఉపాధి దొరుకుతోంది: సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సరోజ్‌ఖాన్ వెనకేసుకొచ్చారు. మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకున్న తరువాత వారిని సినీ పరిశ్రమ గాలికొదిలేయకుండా కనీసం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసనకు దిగడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరోజ్ అలా స్పందించారు. ‘కాస్టింగ్ కౌచ్ చాలా ఏళ్లుగా ఉంది. మహిళతో పడక పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వారూ అందుకు మినహాయింపు కాదు. కేవలం సినీ పరిశ్రమనే ఎందుకు నిందిస్తారు? అది కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది కదా. మహిళలను వాడుకొని అలా వదిలేయట్లేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత సరోజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి క్షమాపణ చెప్పారు. -
శ్రీరెడ్డి ఉదంతం; షాకింగ్ కామెంట్స్
ముంబై: అర్థనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రీరెడ్డి ఉదంతంపై బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్‌ను ఆమె సమర్థించారు. దానివల్ల కొందరికి కనీసం తిండి దొరుకుతుందని అన్నారు. అయితే, ఇలాంటి వ్యవహారలకు సిద్ధపడాలా, వద్దా అనే నిర్ణయం పూర్తిగా అమ్మాయిలదేనని అభిప్రాయపడ్డారు. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన’పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ విధింగా బదులిచ్చారు. రేప్‌చేసి వదిలేయట్లేదు కదా: ‘‘ఒక్క సినిమా రంగంలోనే కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నదని గగ్గోలు పెట్టడం సరికాదు. బయట అన్ని రంగాల్లోనూ మహిళలు ఇలాంటి సమస్యలు ఎదురుర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖల్లోనూ వేధింపుల ఉదంతాలు ఉన్నాయికదా! మీరంతా(మీడియా) సినిమావాళ్ల వెంటే ఎందుకు పరుగెత్తుతారు? ఇక్కడ(సినిమా రంగంలో) రేప్‌లు చేసే మగవాళ్లు వారిని(బాధితురాళ్లని) ఊరికే వదిలేయరు. అలా కనీసం కొందరికైనా తిండి దొరుకుతున్నదని మర్చిపోవద్దు.. అమ్ముడుపోవాల్సిన అవసరమేంటి?: కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకం. వేషాల కోసం మనం ఒకరికి అమ్ముడుపోవాలా, ఒకరిచేతుల్లో బందీకావాలా అని ఎవరికివారే ఆలోచించుకోవాలి. నిజంగా మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అలాంటివాటికి ఎందుకు ఒప్పుకోవాలి? మళ్లీ చెబుతున్నా.. ఇది ఒక్క సినిమా రంగానికే సంబంధించిన వ్యవహారమే కాదు యావత్ సమాజానికి సంబంధించింది’’ అని సరోజ్ ఖాన్ అన్నారు. -
స్ట్రెస్‌లో ఉన్నారా? డాన్స్ చేయండి...
బాలీవుడ్ బాత్ అని సలహా ఇస్తోంది మాధురి దీక్షిత్. ‘ఆందోళనలో ఉన్నప్పుడు చాలా మంది యోగా చేస్తారు. కాని డాన్స్ చేయడం చాలా మంచి ఉపాయం. నేను అదే చేస్తాను’ అందామె. తాజాగా మాధురి దీక్షిత్ తన భర్త శ్రీరామ్ నెనెతో కలిసి టాటా స్కై ద్వారా ఆన్లైన్ డాన్స్ అకాడెమీ ‘డాన్స్ స్టుడియో’ ప్రారంభించింది. టాటా స్కై వినియోగదారులు ఈ ఆన్లైన్ అకాడెమీ సాయంతో ఇంట్లో నుంచే డాన్స్ పాఠాలు నేర్చుకోవచ్చు. హిప్ హాప్, సల్సా, టాంగో... వంటి నృత్యరీతులను మాధురి ఔత్సాహికులకు నేర్పనుంది. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ‘నేను క్లాసికల్ కథక్ డాన్సర్‌ని. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో బాలీవుడ్ డాన్సులు ఎలా చేయాలో నాకు తెలియలేదు. సరోజ్ ఖాన్ (డాన్స్ మాస్టర్) మాస్టరే నాకు నేర్పించారు. ముఖ్యంగా ‘తేజాబ్’లోని ‘ఏక్ దో తీన్’... పాటకు ఎన్నో రిహార్సల్స్ చేయించి నాతోటి ఆ డాన్స్ చేయించారు’ అని గుర్తు చేసుకుంది. ‘డాన్స్ అనేది యువతుల కంటే కూడా గృహిణులకే ఎక్కువ అవసరం’ అని ముక్తాయించిందామె.