
సిని పరిశ్రమలో కలకలం రేపిన ‘కాస్టింగ్ కౌచ్’ గురించి పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించగా...రాధికా ఆప్టే లాంటి హీరోయిన్‌లు తమకు అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌ను అడగ్గా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ‘ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బాగా వెలుగులోకి వచ్చింది. అయితే నా ఉద్దేశ్యం ప్రకారం ఇలాంటి అంశాల గురించి చర్చిస్తే పరిశ్రమ గురించి ప్రజలకు ప్రతికూల భావాలను రేకెత్తించిన వారమవుతాం. అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు’ అని తెలిపారు.
అంతేకాక ‘జీవానాధరం కోసం కష్టపడే యువతీ, యువకులందరికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వారి పనులు జరిపించుకోవాలని చూస్తారు. అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు తారసపడినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని తెలిపారు. ప్రస్తుతం అలియా నటించిన రాజీ సినమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడతున్న సంగతి తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment