బాలీవుడ్ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్యర్య రాయ్, సరోజ్ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ‘తాల్’ సినిమాలోని రామ్‌తా జోగి షూటింగ్ సెట్‌లో తీసిన ఫోటోని షేర్ చేశారు.
‘నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నాను. సినీ పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్‌గా మీరు అంటే అందరికి ఎంతో గౌరవం, ఆరాధన, అభిమానం. నిజంగా మీరు లెజెండ్. మీతో నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ గైడెన్స్‌లో డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషంగా భావించేదాన్ని. మీరు మాపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని వేడుకుంటున్నాను’ అంటూ ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సరోజ్‌ఖాన్‌కు నివాళులర్పించారు. ఐశ్వర్య కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచిన నింబొడ(హమ్ దిల్ దే చుకే సనమ్), డోలా రే డోలా (దేవదాస్), రామ్‌తా జోగి (తాల్), బార్సో రే (గురు) వంటి పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.(సినీ మువ్వల సివంగి)
Comments
Please login to add a commentAdd a comment