అర్థనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రీరెడ్డి ఉదంతంపై బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్‌ను ఆమె సమర్థించారు. దానివల్ల కొందరికి కనీసం తిండి దొరుకుతుందని అన్నారు. అయితే, ఇలాంటి వ్యవహారలకు సిద్ధపడాలా, వద్దా అనే నిర్ణయం పూర్తిగా అమ్మాయిలదేనని అభిప్రాయపడ్డారు.