
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వం వహించ నున్నారు. ఈ నెల 3న సరోజ్ ఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తల్లి బయోపిక్ గురించి ఆమె కుమార్తె సుకైనా నాగ్‌పాల్ ధృవీకరించారు. ‘‘మా అమ్మ మరణానంతరం బయోపిక్ చేస్తామని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. ‘మీ బయోపిక్ తీయాలనుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారు?’ అని అమ్మను గతంలో ఒకసారి అడిగాను. అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం రెమో డిసౌజా. ‘ఓ డ్యాన్స్ మాస్టర్‌గా అతను నా ప్రయాణాన్ని అర్థం చేసుకోగలడు. తను కింది స్థాయి నుంచి పెద్ద దర్శకునిగా ఎదిగాడు’ అని రెమో గురించి అమ్మ చెప్పేవారు. ఆమె బయోపిక్ తీసేందుకు రెమో డిసౌజానే తొలుత మమ్మల్ని సంప్రదిం చారు కూడా. అందుకే అమ్మ బయోపిక్ ఆయన తెరకెక్కిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం’’ అన్నారు సుకైనా.
Comments
Please login to add a commentAdd a comment