‘‘అల్లు అర్జున్‌గారి ‘పుష్ప 2’ సినిమాలోని జాతర సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీలవ్వలేదు. బాధ్యతగా ఫీలయ్యాను. ఈ సినిమాలోని ‘జాతర’ పాటకు, పుష్ప 2 టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. ‘అమ్మాడి...’ (నాని ‘హాయ్ నాన్న’), ‘మార్ ముంత చోడ్ చింత...’ (రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’), ‘లింగిడి లింగిడి...’ (శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి’), ‘నక్కిలిసు గొలుసు...’ (‘పలాస’), ‘కళ్ల జోడు కాలేజ్ పాప...’ (‘మ్యాడ్’) పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి ‘పుష్ప 2’ చిత్రంలోని జాతర పాట, టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’లకు నృత్యరీతులు సమకూర్చారు.
ఈ నేపథ్యంలో విజయ్ పోలాకి మాట్లాడుతూ– ‘‘నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ...’. ఆ తర్వాత చాలా హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాను. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాట కోసం గణేష్ ఆచార్య మాస్టర్‌గారితో కలిసి వర్క్ చేశాను. అయితే ‘పుష్ప 2’లో నాకు కొరియోగ్రాఫర్‌గా చాన్స్ వస్తుందని అప్పుడు ఊహించలేదు. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి...’ జాతర పాట, ‘పుష్ప... పుష్ప...’ పాటకు వర్క్ చేశాను. జాతర పాట రొటీన్‌గా ఉండకూడదని సుకుమార్‌గారు చె΄్పారు.
ఇలా ఉండాలి అంటూ... కొన్ని మూమెంట్స్ ఆయన చూపించారు. పుష్పరాజ్ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని ఈ పాట చేయాలనుకున్నాను. అందుకని ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ని చాలాసార్లు చూశాను. జాతర సాంగ్‌కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి, 20 రోజులు షూట్ చేశాం. అల్లు అర్జున్‌గారు చాలా కష్టపడి చేశారు. ప్రస్తుతం సాయితేజ్‌గారి ‘సంబరాల ఏటిగట్టు’, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌గారి ‘భైరవం’, ‘మ్యాడ్ 2’ (సింగిల్ కార్డు), హిందీలో ‘బేబీ’ సినిమాలకు వర్క్ చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment