ఆ కొరియోగ్రాఫర్‌ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్‌ | Kriti Sanon Recalls Crying After A Choreographer Scolded Her In Front Of 50 Models - Sakshi
Sakshi News home page

ఆ కొరియోగ్రాఫర్‌ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్‌

Published Tue, Sep 5 2023 11:46 AM | Last Updated on Tue, Sep 5 2023 12:17 PM

Kriti Sanon Recalls Crying After A Choreographer Scolded Her In Front Of 50 Models - Sakshi

కృతి సనన్..ఇప్పుడొక స్టార్‌ హీరోయిన్‌. అయితే ఆ స్టార్‌డమ్‌ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించి.. టాలీవుడ్‌ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్‌:నేనొక్కడినే’. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్‌ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది.

తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్‌ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్‌ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్‌ మూవీ వన్‌: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్‌ షోలో పాల్గొనడానికి వెళ్లాను. 

పచ్చికలా ఉన్నర లాన్‌లో క్యాట్‌వాక్‌ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్‌ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్‌ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి గణపత్‌:పార్ట్‌వన్‌ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 

(చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement