![Paruchuri Gopala Krishna Comments on His Eye Operation - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/11/02255.jpg.webp?itok=Yw9ssGa9)
పరుచూరి బ్రదర్స్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫొటో ఒకటి ఇటీవల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే! దీంతో ఆయన సోదరుడు గోపాలకృష్ణ స్పందిస్తూ.. అన్నయ్య బాగానే ఉన్నాడని, బరువు తగ్గడంతో, జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా కనిపించాడని తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.
అయితే కొన్నాళ్ల నుంచి పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో కనిపించలేదు. దీంతో అభిమానులు ఆయన ఎందుకు కనిపించడం లేదని ఆందోళన చెందారు. తాజాగా ఈ అనుమానాలకు చెక్ పెట్టాడు పరుచూరి. యూట్యూబ్‌లో ఓ కొత్త వీడియోతో వీక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ గురించి చెబుతూ.. తన కంటికి ఆపరేషన్ జరిగిందని వెల్లడించాడు. తన నేత్రాలకు శస్త్ర చికిత్స జరిగిందని, అందుకే ఓ నెల రోజులుగా యూట్యూబ్‌లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. ఇంకో రెండు, మూడు వారాలు లైట్ ఫోకస్ పడకూడదని వైద్యులు చెప్పారన్నాడు. అందువల్లే ఎలాంటి వీడియోలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ.
చదవండి: గతిలేక లైంగిక సంబంధం కొనసాగించా.. డైరెక్టర్‌పై మహిళల ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment