తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన 15రోజులవుతున్నా ఇంకా సార్ జోష్ తగ్గలేదు. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. విద్యా వ్యవస్థపై, విద్యార్థుల హక్కులను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.
ఈ క్రమంలో థియేటర్ల వద్ద సార్ సందడి కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలో ఇటీవలె ఖమ్మంలోని స్కూల్ విద్యార్థులు ఈ సినిమా ఉచితంగా చూపించాలంటూ ధర్నాకు దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి ఏకంగా నిర్మాత నాగవంశీ దృష్టికి చేరింది. దీంతో పిల్లల కోసం ఫ్రీ షో కావాలనే వారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. విద్యా హక్కుపై అవగాహన కల్పించడమే సార్ ప్రధాన లక్ష్యం. మా సినిమాను స్కూలు పిల్లలకు ఉచితంగా చూపించాలనుకుంటున్నాం. మీరు చేయాల్సిందల్లా contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయడమే. మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి షో ఖరారు చేస్తుంది అంటూ నాగవంశీ పేర్కొన్నారు.
The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids.
— Naga Vamsi (@vamsi84) March 4, 2023
Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation!
Comments
Please login to add a commentAdd a comment