
Rana Daggubati: తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్‌కు విశేష స్పందన వస్తోంది. తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రాక్ సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యమీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్
అయితే రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మత్రం రాలేదు. ఇదిలా ఉండగా రానాకు భార్య పాత్రలో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. ఈ తాజా బజ్ ప్రకారం.. మలయాళం నటి సంయుక్తా మీనన్ రానాకు భార్యగా కనిపించనుందట. ఇటీవల ఆమెను చిత్ర బృందం సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. భీమ్లా నాయక్‌లో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా డానియల్ శేఖర్‌గా అలరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment