darshanam mugulaiah
-
పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024 బీఆర్ఎస్ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.కేటీఆర్ స్పందనతాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. Thanks Sucheta Ji for bringing this news to my attention I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6— KTR (@KTRBRS) May 3, 2024 -
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం
కిన్నెర వాయిద్యకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన రెండో కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే..మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది. మంగళవారం ఓ గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
కళాకారుడి బతుకుపళ్లెం
మహా కథకుడు ప్రేమ్‌చంద్ కాశీలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఆ రాబడితో బతకలేక సినిమాలకు రాద్దామని బొంబాయి చేరుకున్నాడు. తన మానవీయ, సామ్యవాద ధోరణులకు తగినట్టుగా ఒక సినిమాలో జీతం ఇవ్వని యజమానిపై కార్మికులు తిరగబడాలని రాశాడు. తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు. తిరిగి కాశీకి చేరుకుంటే సొంత ప్రెస్ కార్మికులు జీతం కోసం సమ్మె చేశారు. పైగా సమ్మె చేయమని మీరే రాశారు కదా అన్నారు. ప్రేమ్‌చంద్‌కు అనారోగ్యం. క్షయ. జీవితాంతం నానా బాధలు పడ్డాడు. ఇంత గొప్ప కథకుడివి, నీ కష్టం ఏమిటి అని ప్రభుత్వం అడిగి ఉంటే ఆయన బతుకు మరోలా ఉండేది. తెలుగువారు గర్వించదగ్గ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పాఠకులను, కళాభిమానులను నమ్ముకుని ఫుల్‌టైమ్ రైటర్‌గా ఉన్నాడు. ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివితే రచయితగా ఎన్ని సన్మానాలు పొందాడో బతకడానికి అన్నే అవస్థలు పడ్డాడని అర్థమవుతుంది. చివరి రోజుల్లో ఆయన ఒక ధనవంతునికి లేఖ రాస్తూ ‘నేను పోయాక నా భార్యకైనా సహాయం అందేలా చూడండి’ అని ప్రాథేయపడటం కనిపిస్తుంది. నాజర్ బుర్రకథ చెబుతున్నాడంటే పల్లెల్లో టికెట్ షో కోసం కట్టిన అడ్డు తడికెలు జనం ధాటికి తెగి పడేవి. పల్నాటి వీరగాథను శౌర్యంతో పాడిన ఈ గాయకుడు చివరి రోజుల్లో శౌర్యంగా బతక లేక పోయాడు. సరైన ఇల్లు లేదు. అనారోగ్యం బాధించింది. ప్రభుత్వంలో పెద్దలందరికీ ఆయన తెలిసినా సరైన సమయంలో సహాయం అందలేదు. తమిళవాడైనా తెలుగు నేర్చుకుని తెనాలిలో ఉంటూ కథలు, నవలలు రాసిన శారద (నటరాజన్) హోటళ్లలో సర్వర్‌గా పని చేస్తూ దారుణమైన పేదరికంలో మరణించడం మనకే చెల్లింది. మద్రాసులో 1970ల కాలంలో జీతం చాలక కనిపించిన ప్రతివాణ్ణీ ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడిగిన ప్రఖ్యాత తెలుగు కవిని చూసి, ఏడవలేక నవ్వి ముళ్లపూడి వెంకటరమణ ‘అప్పారావు’ పాత్రను సృష్టించాడని అంటారు. ఆ అప్పారావు ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడగనివాడు లేడు. ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్. ఒక కాలంలో ఫైవ్ రూపీస్ కోసం అల్లల్లాడిన కళాకారులు ఉన్నారు. నేడు ఓ ఫైవ్ థౌజండ్ కోసం చూసే వారూ ఉన్నారు. ‘కళ జమీందార్లకు మాత్రమే ఉండాల్సిన జబ్బు’ అనేవాడు కార్టూనిస్టు మోహన్. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి శ్రీమంతులు, రాజా రవివర్మ వంటి మహరాజులు కళను అభిమానించి సాధన చేశారంటే వాళ్లకు తిండికి ఢోకా లేకపోవడం ఒక కారణం. కాని కళ పట్ల ఉన్మత్తతతో దాని కోసమే జీవితాన్ని వెచ్చించాలని అనుకుంటే ప్రతిపూటా భోజనం వచ్చి ‘నా చంగతేంటి?’ అని అడక్క మానదు. భార్య, సంతానం, సంసారం... వీరు కూడా! కళలో రాణించాలి, సంసారాన్ని పోషించాలి అనేది అనాదిగా ఈ దేశంలో కళాకారులు ఎదుర్కొంటున్న విషమ పరీక్ష. ‘పథేర్ పాంచాలి’ నవలలో 1910 నాటి కరువు రోజుల్లో ఆ తండ్రి పల్లెటూళ్లోని భార్యను, కొడుకును, కూతురిని ఆకలికి వదిలి, వారి కోసం నాలుగు అన్నం ముద్దలు వెతకడానికి కవిగా, నాటక రచయితగా రాణించడానికి పట్నం వెళతాడు. కాని అతను రాడు. అతని కూతురు దుర్గ సరైన తిండి, వైద్యం లేక మరణిస్తే ఆ దయ నీయమైన మరణం పాఠకుణ్ణి వదలదు. కళకు ఈ దేశంలో పేదరికం అనే వదలని నీడ ఉంటుంది. ఆశ్రయం పొంది కళ రాణించింది చాల్నాళ్లు. రాజాశ్రయం, జమీందార్ల ప్రాపకం సంపాదించిన కళాకారులు తిండి నిశ్చింతతో బతికారు. అలా ఆశ్రయం పొంద నిరాకరించినవారు, పొందలేక పోయిన వారు ఎన్నో బాధలు పడ్డారు. నిజమైన కళాకారులు ‘జీ హుజూర్’ కొలువుకూ, జీతం రాళ్ల ఉద్యోగాలకు ఒదగరు. గొప్ప ప్రతిభ కలిగి, తమ కళతో సమాజానికి ఉల్లాసము, చైతన్యము, పరివర్తన ఇవ్వగలిగిన కళాకారులు ఎందరో నేడు కళను ‘వీలున్న సమయాల్లో’ సాధన చేస్తూ మిగిలిన సమయమంతా బతుకు తండ్లాటలో గడపవలసి వస్తున్నదన్నది వాస్తవం. కెనడా వంటి దేశాలలో ‘నేనొక నవల రాస్తాను’ అని దరఖాస్తు చేసుకుంటే పని చేసే సంస్థ పూర్తి శాలరీతో ఏడాది నుంచి రెండేళ్ల కాలం సెలవు మంజూరు చేసే వీలుందట. నవలాకారుడు గార్షియా మార్క్వెజ్ తన భార్యతో ‘ఒక రెండేళ్లు ఇంటిని నెట్టుకు రాగలవా? పైసా ఇవ్వలేను. నవల రాసుకుంటాను’ అనంటే ఆమె ‘సరే’ అంది. ఆమె ఇల్లు చూసుకోవడం వల్ల మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అనే క్లాసిక్ రాశాడు. నిజానికి ఆ రెండేళ్లు ఇంటిని నెట్టుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది! కళాకారులు పరోక్ష శాసనకర్తలు. వారు సమాజానికి నైతిక పాలననూ, సాంస్కతిక విలువలనూ కల్పిస్తారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అచ్చు వేయగలదు. కాని కళాకారులే ఏది మంచో, ఏది చెడో జనులకు కళాత్మక పద్ధతిలో హదయాలకు ఎక్కేలా చేస్తారు. అందుకే కళాకారుల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కూడా! తెలంగాణ ప్రభుత్వం పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యకు నివాసం, ఉపాధికి కోటి రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన అంశం. ఇలా సమాజానికి ఉపయోగపడే, సీరియస్ కళాసాధనలో ఉండే సహాయం అందితే గొప్ప కళాసృష్టి చేయదలిచే కళాకారులకు మరింత నిర్మాణాత్మక పద్ధతిలో ప్రభుత్వ మద్దతు అందే ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కళాకారుల జీవన సమర్థనకు అవసరమైన ప్రయత్నాలు మొదలెట్టాలి. నకిలీ, కృత్రిమ, విశృంఖల, హానికారక వినోద కళల నుంచి దేశ ప్రజలను కాపాడాలన్నా, ప్రాదేశిక సంస్కృతిని నిలబెట్టుకోవాలన్నా ముందు కళాకారులను బతికించుకోవాలి. కళ బతుకు గాక కళాకారుని ఊపిరి యందు! -
శెభాష్ దర్శనం మొగిలయ్య.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ'
సాక్షి, హైదరాబాద్: 2022 సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. అందులో మొగిలయ్య ఒకరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం.. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డ్‌ని ప్రకటించింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ.. కథలు చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్ మొదట్లో కొంత బాగాన్ని పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. -
‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
Pawan Kalyan Financial Help To Kinnera Mogulaiah: `భీమ్లా నాయక్` చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును అందించబోతున్నట్లు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?) `తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. -
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
కన్నీటి కిన్నెర
పురాణ ప్రశస్తి పొందిన శతాబ్దాల నాటి అపురూప వాద్య పరికరం కిన్నెర. ఎలక్ట్రానిక్ వాయిద్యాల హోరులో అంతరించే దశకు చేరుకుంది. ఇప్పుడు దాని తయారీని పట్టించుకునే వారే లేరు. అలాంటి అరుదైన కిన్నెరను నేటికీ మీటుతున్న ఏకైక కళాకారుడు దర్శనం మొగులయ్య (63). కిన్నెరపై ఆయన చేసే స్వర విన్యాసాన్ని విన్నవారు, కన్నవారు ఎన్ని ప్రశంసలు కురిపిస్తున్నా, ఆ కళాకారుడికి పూట గడవడమే కష్టంగా ఉంటోంది. తరతరాలుగా నమ్ముకున్న కిన్నెర తనకు అన్నం పెట్టకున్నా, అదే తన ప్రాణమని చెబుతున్న మొగులయ్య గురువారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో కచేరీ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలకరించినప్పుడు ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నాడు. అవి ఆయన మాటల్లోనే... ఈ కిన్నెరను మా తాతల కాలంలో తయారు చేశారు. దాన్నే మార్చుకుంటొస్తున్న. దీన్ని వాయించడం ఇంకెవ్వరికీ రాదు. నాకొస్తది. ఎంత బాగా వినిపించినా ఏం లాభం? కూటికొస్త లేదు, గుడ్డకొస్త లేదు ఈ విద్య. ఇంటిని నడపాలంటే కూలిపనే దిక్కు. ఇంతకు ముందు కూడా ఈ కళ అన్నంపెట్టనప్పుడు ఐదేళ్లు మట్టిపని చేసిన. కానీ, కిన్నెరను చూస్తే పాట మొదలెట్టాలనిపిస్తది. నా మూడో కొడుకుకు మూర్ఛరోగం. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ఉన్న పెద్దపెద్ద దవాఖానలన్నీ తిరిగిన. అప్పుసొప్పుజేసి మూడు లక్షలదాకా ఖర్చుపెట్టిన. అవన్నీ ఇప్పుడు గుండెమీదున్నయి. పిల్లలు నేర్వరు.. ఉండ ఇల్లు లేదు. దున్న భూమి సంపాదించలేదు. బుక్కెడు బువ్వ అడుక్కోవడానికి పనికొచ్చే ఈ విద్యను నేర్చుకోం అంటున్నరు నా కొడుకులు. ముత్తాతల నుంచి వస్తున్న ఈ కళను ఈ తరమోల్లు కూడా అందుకోవాలని, అట్ల దీని సప్పుడు ఆగిపోవద్దని నా కోరిక. నా కుటుంబం ఎల్లే దారి దొరికితే నాకొచ్చిన ఈ విద్యను పదిమందికీ నేర్పిస్త. మనసున్నోళ్లు ఎందరో... ఈ కళ నాతోనే పోవద్దని దాసరి రంగ( తెలుగు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్) ఎంతో ప్రోత్సహించినరు. దీని గురించి పేపర్ల రాసి ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇప్పించిండు. ప్రదర్శనలకు రావడానికి, ఇల్లు రిపేర్‌కు రంగయ్య సారే పైసలిచ్చిండు. లామకాన్‌లో ప్రదర్శన కోసం పైసల్లేక బస్టాండులో దిక్కుతోచక నిలుచుంటే భువనగిరి మారాజు సుధాకర్ సార్ టికెట్ పైసలిచ్చిండు. మూడువేల కోసం అప్పులోల్లు నా కిన్నెరను జప్తు చేసుకుంటే, లాయర్ సార్ (సీవీఎల్ నరసింహారావు) సాయం చేసిండు. గుర్తింపునకు కొదువ లేకపోయినా, దినదినం తిండికి తడుముకోవాల్సి వస్తోంది. కదిలివచ్చిన కళాభిమానులు మెట్ల కిన్నెర వాయిస్తూ తెలంగాణ వీరగాథలను అద్భుతంగా వినిపించే మహబూబ్‌నగర్ వాయిద్యకారుడు మొగులయ్య ప్రదర్శనకు జానపద కళాభిమానులు ఎంతోమంది కదిలి వచ్చారు. పండుగ సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, వంగ పకీరయ్య కథలను ఆయన వినిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దయనీయ స్థితిలో వున్న ఈ పేద కళాకారుడికి అక్కడికి వచ్చిన పలువురు తమకు తోచిన విధంగా విరాళాలు అందచేశారు. లామకాన్‌లో జరిగిన ఈ ప్రదర్శన వాగేశ్, శ్రీశైలం ఏర్పాటు చేశారు. సినీ దర్శకులు అజిత్ నాగు, అవసరాల శ్రీనివాస్.. రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్.జగన్, రిటైర్డ్ ప్రొఫెసర్లు కిషన్రావ్, రాములు, కళాకారులు నిస్సార్, బైరాగి, గడ్డం యాదగిరి, కార్టూనిస్ట్ శివాజీతో పాటు రేడియో, టీవీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ పరంపర... పన్నెండేళ్ల బాల్యం నుంచే కిన్నెరతో చెలిమి చేసిన మొగులయ్య పూర్వీకులు కాశీం, వెంకటరాముడు, మొగులాన్, రాములయ్య, ఎల్లయ్యలు. ఎల్లయ్య కొడుకే మొగులయ్య. యాభయ్యేళ్లుగా కిన్నెరతో సావాసం చేస్తున్న మొగులయ్య ఆత్మాభిమానం ఉన్న కళాకారుడు. ఎన్నడూ చేయిచాచి ఎరుగడు. వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఎంతో నేర్పుతో ఈ కిన్నెర వాద్యాన్ని ఆయన పూర్వీకులు తయారు చేశారు. పానుగంటి మీర్‌సాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ వంటి తెలంగాణ కథలను మొగులయ్య వినసొంపైన తన వాద్యంతో హావభావ సహితంగా వినిపిస్తాడు. ఆయన ప్రదర్శనను తిలకించిన వారు మళ్లీ మళ్లీ తిలకించాలనుకుంటారు. కిన్నెర కమ్మదనాన్ని పదే పదే ఆస్వాదించాలనుకుంటారు. ఈ కన్నీటి కిన్నెరను ఆదుకోదలచినవారు ..9505513891నంబరుకు ఫోన్ చేయండి. - ఓ మధు