![Padma Shri Awardee Darshanam Mogilaiah Daughter Was Dead - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/5/layya.gif.webp?itok=VyfJcnSv)
కిన్నెర వాయిద్యకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన రెండో కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే..మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది.
మంగళవారం ఓ గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment