Mogulaiah
-
బలగం సింగర్ మొగిలయ్య మృతి
-
హైదరాబాద్ నిమ్స్ కు బలగం మొగిలయ్య తరలింపు..
-
కష్టాల్లో ‘బలగం’ మొగిలయ్య.. డబ్బుల్లేక దీనంగా వేడుకోలు
బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులైన ఈ దంపతులకు వారసత్వంగా వచ్చిన తంబూర, దిమ్మస తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. (చదవండి: తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ సింగర్..స్పందించిన మంత్రి) రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డ మొగిలయ్య ఏడాది క్రితం ఉన్నట్టుండి ఓరోజు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు వరంగల్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14 లక్షల వరకు ఖర్చయ్యాయి. రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా సరిపోని పరిస్థితి. మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలోనే బలగం సినిమాలో అవకాశం వచ్చింది. ‘బీపీ, షుగర్ పెరగడంతో రెండు కళ్లు కనిపించడంలేదు. ఆపరేషన్ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మనసున్న మారాజులు ఆదుకోవాలి’అని కొమురమ్మ వేడుకుంటోంది. – వరంగల్ డెస్క్ ఆర్థికసాయం చేయదల్చిన వారు పస్తం కొమురమ్మ బ్యాంక్ అకౌంట్ నంబర్: 62306309034 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, దుగ్గొండి, వరంగల్ జిల్లా ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0020655 గూగుల్‌పే నంబర్: 90590 98236 ఫోన్‌పే నంబర్ : 91772 54408 -
తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ బలగం సింగర్.. స్పందించిన మంత్రి
గత కొంతకాలంగా అందరూ బలగం సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో అందరినీ కంటతడి పెట్టించిన సన్నివేశం ఏదైనా ఉందంటే అది క్లైమాక్సే! కొమురవ్వ, మొగిలయ్యలు బుర్రకథతో రక్తసంబంధ విలువను చాటిచెప్పేలా గొంతెత్తి పాడుతూ ప్రేక్షకులను ఏడిపించేశారు. కానీ ఈ దంపతులు ప్రస్తుతం కన్నీళ్లతో సావాసం చేస్తున్నారు. కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మొగిలయ్యకు అండగా ఉంటామన్నారు. మొగిలయ్యను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్నిరకాల పరీక్షలు చేసి అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయనకు డయాలసిస్ సహా మెరుగైన వైద్యం అందించి, మందులు ఇవ్వాలని తెలిపారు. కాగా మొగిలయ్య కొంతకాలంగా షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవడంతో వరంగల్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. బీపీ, షుగర్ పెరగడంతో ఆ ఎఫెక్ట్ కళ్లపై పడింది. ఇప్పుడు రెండు కళ్లు కూడా కనిపించడం లేదు. ఇటీవల దర్శకుడు వేణు మొగిలయ్య ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే! -
నిజాం పునాదులు కదిలించిన ఓరుగల్లు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా ఊర్లకు ఊర్లు మర్లబడ్డయి. గ్రామస్తులు బరిసెలు, తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి దిగారు. వీరిని చంపేందుకు రజాకార్లు చేయని ప్రయత్నం లేదు. నిజాం సైన్యం ఊర్లపై పడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. గ్రామాల్లో మూకుమ్మడి హత్యలు చేశారు. అయినా వెరవలేదు. భయపడలేదు. ఎదురొడ్డి నిలిచి పోరాడారు. సింహంలా దూకిన మొగిలయ్య హన్మకొండ కల్చరల్/వరంగల్ అర్బన్: 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించారు. ప్రతివారం వరంగల్ కోటలో, స్తంభంపల్లిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఏ.సుదర్శన్, బి. రంగనాయకులు, వి.గోవిందరావు, భూపతి కృష్ణమూర్తి, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్యల ఆధ్వర్యంలో 1944 నుంచి జెండా వందనాలు జరుగుతూ వచ్చాయి. బత్తిని రామస్వామి ఇంటిముందున్న ఆవరణలో 1946, ఆగస్టు 11న జెండావందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న రజాకార్ల గుంపు ఖాసీం షరీఫ్ ఆధ్వర్యంలో వారిపై దాడి జరిపారు. బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. వెంకటయ్య చేయి నరికివేశారు. కూచం మల్లేషం తుపాకీ గుండుతో గాయపడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటికే కల్లుగీసేందుకు వనానికి వెళ్లిన మొగిలయ్యకు తన సోదరుడు గాయపడిన సంగతి తెలిసింది. వెంటనే సింహంలా వచ్చి వారిపై కలబడ్డాడు. మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టాడని భావించిన రజాకార్లు బరిసెతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖాసీం షరీఫ్, తన అనుచరులు ఖిలా వరంగల్ నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలకు మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ భయం కలిగించేలా ఊరేగింపు చేశారు. మొగిలయ్య స్మారక చిహ్నంగా ఎల్లమ్మ బజారులో ఒక భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికి మొగిలయ్య హాలుగా ప్రసిద్ధి చెందింది. సగర్వంగా జీవిస్తున్నా.. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులైన మా నాన్న గురించి పదే పదే చెప్పేవారు. రజాకార్లకు ఎదుదొడ్డి నిలిచి వీరమరణం పొందాడని చెబుతుండడం గర్వంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ.. బత్తిని మొగిలయ్య గౌడ్ ట్రస్టునుంచి ఎలాంటి గుర్తింపు, ఆర్థికసాయం లేదు. – బత్తిని బాబు గౌడ్, మొగిలయ్య కుమారుడు ఒంటిచేత్తో... జాఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఒంటిచేత్తో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. తుపాకీ చేతపట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత ఆమె. గాయపడ్డ సహచర ఉద్యమకారులకు వైద్యం అందిస్తూ తనలోని గొప్పదనాన్ని చాటుకున్నారు. నెల్లుట్ల మోహన్‌రావుకు సహాయకురాలిగా పనిచేస్తూ.. ఆయననే వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మోహన్‌రావు కమ్యూనిస్టు పార్టీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోహన్‌రావు మృతిచెందగా.. వృద్ధాప్యంలో ఉన్న సుశీలాదేవి మాత్రం ప్రస్తుతం వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమరయోధుల పింఛన్ రానప్పటికీ, భర్తకు వచ్చే పింఛన్‌తో బతుకు బండి లాగిస్తున్నారు. (క్లిక్ చేయండి: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్) గత చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్’ జనగామ: నిజాం నిరంకుశ పాలనపై మొదలైన తిరుగుబాటు.. దొరల పాలనకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అరాచకాలు ప్రజలను గోసపెట్టాయి. తనకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను హతమార్చాడు. 1947లో నలుగురు విప్లవకారులకాళ్లు, చేతులు కట్టేసి గూండాల సహాయంతో సవారు కచ్చరంలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఊరి శివారున ఉన్న ఈత చెట్ల వనం సమీపంలో నలుగురిని సజీవ దహనం చేస్తున్న క్రమంలో.. ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అదే మండలం కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు సుమారు పదివేల మందికిపైగా బాబుదొర జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. దీంతో అతను పోలీస్ శరణుకోరి తలదాచుకున్నాడు. తమ విముక్తి కోసం పోరాడుతున్న ముగ్గురు విప్లవకారులను చంపేశారనే ఆవేశంలో పోలీస్‌స్టేషన్‌ను సైతం బద్దలు కొట్టేందుకు యత్నించారు. దీంతో బాబుదొర గన్‌తో బెదిరిస్తూ.. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని పాత ఆంధ్రాబ్యాంకు ఏరియాలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విప్లవయోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోతు దర్గ్యానాయక్ (ప్రస్తుతం బతికే ఉన్నారు). మరికొందరు విప్లవకారులు జనగామ రైల్వే వ్యాగన్ ఏరియాలో కాపుకాస్తూ.. దొర రాకకోసం ఎదురుచూశారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలుకింద నుంచి దొర దాటుకుంటూ వ్యాగన్ పాయింగ్ రావిచెట్టు కిందకు రాగానే దర్గ్యానాయక్ ఆయన మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో ప్రజల జయజయధ్వానాల మధ్య సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చరిత్రకెక్కని సంకీస పోరు; 21 మందిని సజీవ దహనం చేసిన రజాకార్లు డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రజాకార్ల ఆగడాలకు 21 మంది గ్రామస్తులు బలి కాగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ.. ఆ పోరాటం చరిత్రకెక్కలేదు. మానుకోట, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య, ఉయ్యాలవాడకు చెందిన ఏలూరి వీరయ్య, నున్నా పుల్లయ్య వేర్వేరుగా దళాలను ఏర్పాటు చేసి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. సంకీసకు చెందిన తుమ్మ శేషయ్య దళాలకు ముందుండి నడిపిస్తుండడంతో ఆయన్ను మట్టుబెట్టాలని రజాకార్లు పలుమార్లు ప్రయత్నించారు. శేషయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించి మూడుసార్లు గ్రామాన్ని తగులబెట్టారు. నాలుగోసారి 1948, సెప్టెంబర్ 1న రజాకార్లు గ్రామంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు. శేషయ్య ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరినీ బందెలదొడ్డి వద్దకు చేర్చారు. 15 ఏళ్లలోపు వారిని బయటకు పంపి.. మిగతా వారిని చిత్రహింసలకు గురిచేశారు. శేషయ్య జాడ చెప్పకపోవడంతో గ్రామస్తులపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొందరు చనిపోగా.. కొన ఊపిరితో మరికొందరు కొట్టుకుంటుండగా వరిగడ్డి వారిపై వేసి కాల్చారు. వరి గడ్డి కోసం గడ్డివాము వద్దకు వెళ్లిన రజాకార్లకు గడ్డివాములో దాక్కున్న అన్నాతమ్ములు తేరాల గురవయ్య, రామయ్య, లాలయ్య కనిపించారు. వారు ఎంత బతిమిలాడినా వినకుండా తుపాకులతో కాల్చి చంపి అందరినీ ఒకచోటకు చేర్చి గడ్డితో తగులబెట్టారు. కాల్పుల్లో 16 మంది చనిపోగా.. తరువాత గాయాలతో ఐదుగురు ప్రాణాలు వదిలారు. రజాకార్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తరువాత సగం కాలిన మృతదేహాలకు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దే సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. నాటి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారిలో కొద్దిమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు. నెత్తురోడిన తమ్మడపల్లి(జి); ఒకేరోజు 12 మంది వీరమరణం జనగామ/జఫర్‌గఢ్/స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జి) ఊరి త్యాగం చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించదు. గ్రామానికి చెందిన 12 మందిని నిజాం సైన్యం కాల్చి చంపేసింది. నిజాం ఏజెంటుగా వ్యవహరించే ఖాదరెల్లి జాఫర్‌గఢ్ కేంద్రంగా తన అరాచకాలను కొనసాగించాడు. భరించలేని రైతులు ప్రజా రక్షక దళాలుగా ఏర్పడి కర్రలు, వడిశాలలు, బరిసెలు, కత్తులు, కారంపొడితో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టు ప్రతినిధులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్‌రావు వీరికి అండగా నిలిచారు. 1947, సెప్టెంబర్ 11న జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం స్ఫూర్తితో తమ్మడపల్లి(జి), సురారం, షాపల్లి, తిమ్మాపూర్‌తోపాటు అనేక గ్రామాల ప్రజలు ఖాదరెల్లి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. విషయం తెలుసుకున్న రజాకార్లు తమ బలగాలతో తమ్మడపల్లి (జి) గ్రామాన్ని చుట్టుముట్టి 20 మందిని బంధించి, గ్రామ శివారులో వరుసగా నిలబెట్టి వారిపై బుల్లెట్ల వర్షం కురించారు. ఈ ఘటనలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుండెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ.ఖాసీం, గుజ్జరి రామయ్య, దిడ్డి పెరుమయ్య, కోమటి నర్సింహరామయ్య, కుంట పెద్దపురం, మంగలి వెంకటమల్లు, గుండెటి గుండారెడ్డి అసువులు బాయగా.. మరో 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) -
నా కళను అవమాన పరుస్తున్నారు: కిన్నెర మొగులయ్య
-
నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: మొగులయ్య
తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగులయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. అయితే తాజాగా అతడు తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు. 'నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మొన్నామధ్య పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు ఇస్తున్నడా? అని నాతో గొడవపడ్డారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట. నాకు ఆ పతకం అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ ఎవరిదైనా సరే అది తిరిగి ఇచ్చేస్తా. కానీ పేదోడిని అయిన నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది' అని ఆవేదన వ్యక్తం చేశాడు మొగులయ్య. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు -
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం
కిన్నెర వాయిద్యకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన రెండో కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే..మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది. మంగళవారం ఓ గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
ఘనంగా ‘పద్మ పురస్కారాల ’ ప్రదానోత్సవం (ఫోటోలు)
-
వెయ్యి రూపాయలు లేక భార్య, కొడుకు చనిపోయారు: మొగులయ్య
మొగులయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే.. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయన జీవితం పూలపాన్పు కాదు.. ముళ్ల దారి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చవిచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. 'నేను చాలా బీదవాడిని. వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బస్టాండ్లల్ల డబ్బులు అడుక్కుంటూ సరిగా తిండి లేక చివరాఖరికి చేనిపోయింది. ఆమె చనిపోయాక కూడా శవాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గతి లేదు. విషయం తెలుసుకుని కేవీ రమణాచారి గారు 10 వేల రూపాయలు ఇస్తే అప్పుడు బండి కిరాయి కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. సరిగా తిండి లేక మూడేండ్ల కిందట చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. మొన్న మా కొడుకు గుండెలో నీరొచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ కళను బతికించాలన్నదే నా కోరిక' అని మొగులయ్య పేర్కొన్నాడు. -
‘పద్మ శ్రీ’మొగులయ్య.. 12 మెట్ల కిన్నెర.. తెలంగాణలో ఒక్కరే!
‘ఆడా లేడు మియాసావ్.. ఈడా లేడు మియాసావ్.. పానిగంటి గుట్టలమీద పావురాల గుండున్నదీ.. రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..’ అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ పాటతో మరింత ఫేమస్ కిన్నెర కళ అంతరించిపోతుండటంతో మొగులయ్య దానికి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు. ఈయన కళను గుర్తించి ఎంతోమంది ఆయనకు బాసటగా నిలిచారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగ మొగులయ్యను ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో ఎందరో ఆప్తులుగా మారి అండగా నిలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మొగులయ్య మరింత ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కష్టాల్లోనూ కిన్నెరను వదలలేదు మొగులయ్య పూర్వీకులు తాతలు, ముత్తాతల కాలం నుంచి కిన్నెర వాయిస్తూనే జీవనోపాధి పొందారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. సుమారు 500 ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్న కిన్నెర మొదట ఏడు మెట్లు మాత్రమే ఉండేది. మొగులయ్య ప్రత్యేక శ్రద్ధతో తర్వాత 12 మెట్ల కిన్నెరగా తీర్చిదిద్ది.. ఆ వాయిద్యంతో మరిన్ని రాగాలను పలికిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్యకు సెంటు భూమి లేదు. కిన్నెరనే ఆయన జీవనాధారం. అనారోగ్యంతో భార్య, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిగా మరణించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఏనాడూ కిన్నెరను విడిచిపెట్టలేదు. పొట్టకూటి కోసం వరంగల్, మహారాష్ట్రలో మట్టిపని చేస్తూ కాలం ఎల్లదీశాడు. పన్నెండేళ్ల ప్రాయంలో కిన్నెర పట్టుకున్న మొగులయ్య వృద్ధాప్యం వచ్చినా.. తన కళను బతికించేందుకు తపిస్తూనే ఉన్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయ పురాతన వాయిద్యం కిన్నెరను మొగులయ్య జీవనోపాధిగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కళను నేర్చుకునేవారు కరువయ్యారు. కిన్నెర తయారీ సైతం ఎవరూ చేయడం లేదు. అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన కిన్నెరను 12 మెట్లుగా అభివృద్ధి చేసిన ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్య ఒక్కరే. -
కిన్నెర మెట్లు... బతుకు పాట్లు
సాక్షి, నాగర్‌కర్నూల్ : ఆయన వాయిద్యం విద్యార్థులకు ఓ పాఠ్యాంశం.. ఆయనకొచ్చిన అవార్డులు, సత్కారాలు లెక్కకు మించి.. వేదికలపై వేనోళ్ల ప్రశంసలు.. కానీ రోజూ ఐదు వేళ్లు నోట్లోకి పోని దుస్థితి! అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యానికి ప్రాణం పోసి, పల్లె పాటకు పట్టం కట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న మొగులయ్య దీనగాథ ఇదీ!! 70 ఏళ్ల మలిసంధ్యలో ఉపాధి లేక ఆయన యాచకుడిగా మారి బతుకు వెళ్లదీస్తున్నాడు. ఊరూరూ తిరుగుతూ పొట్టబోసుకుంటున్నాడు. ప్రాథమిక విద్యలో పాఠ్యాంశంగా ఆయన కిన్నెర వాయిద్యాన్ని చేర్చడంతో అడపాదడపా స్కూళ్లలో ప్రదర్శనలిస్తూ పిల్లలిచ్చే రూపాయి, రెండు రూపాయలను తీసుకొని కళ్లకద్దుకుంటున్నాడు. కిన్నెరే బతుకుదెరువుగా.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఎల్లయ్య, రాములమ్మలకు మొగులయ్య మొదటి సంతానం. తండ్రి ఏడు మెట్ల కిన్నెరతో ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టేలా జానపదాలను రూపొందించుకుని కిన్నెరపై పాడేవాడు. తండ్రి మరణానంతరం మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందుకున్నాడు. తండ్రి వాయించిన ఏడు మెట్ల కిన్నెర స్థానంలో సొంత ఆలోచనతో మూడు ఆనపకాయ(సొరకా) బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారు చేసుకుని పాటలు పాడటం మొదలుపెట్టాడు. గ్రామాల్లో వీధివీధి తిరుగుతూ కళను బతికిస్తూ తన బతుకు వెళ్లదీసుకుంటున్నాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పాన్‌గల్ మియాసాబ్, పోరాటయోధుడు పండుగ సాయన్న వీరగాథ, దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుల గాథలను కిన్నెరపై వాయిస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు. పురాణ గాథలను కళ్లకు కట్టినట్లు ఆలపిస్తూ ఈ తరం వారికి కూడా అర్థమయ్యేలా పాడడం కిన్నెర మొగులయ్య ప్రత్యేకత. గుర్తించింది ఓయూ విద్యార్థులే.. పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన కిన్నెర మొగులయ్య వీధుల్లో తిరుగుతూ కిన్నెర వాయిస్తున్న సమయంలో ఆయనలోని ప్రతిభను కొందరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గుర్తించారు. ఆయన కళను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్ శిల్పారామం, రవీంద్ర భారతిలో ఆయనతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించి ప్రముఖుల దృష్టిలో పడేలా చేశారు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడమే కాకుండా తమిళనాడుకు చెందిన వెంకటేశ్వర యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఢిల్లీ తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇలా ఎన్నో రకాల ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందుకున్నాడు. ఊరూరూ తిరుగుతున్న: మొగులయ్య నా భార్య శంకరమ్మ మరణించడంతో లోకమే కుటుంబంగా భావించి ఊరూరూ తిరుగుతున్న. ప్రస్తుతం అదే నా సంపాదన. ఇద్దరమ్మాయిలు, ముగ్గురు కుమారులున్నా వారి బతుకు వారు బతుకున్నారు. ఎవరికీ భారం కాకూడదని ప్రదర్శనలు ఇస్తూ పొట్టపోసుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నెలనెలా గౌరవ వేతనం అందిస్తానని హామీ ఇచ్చారు. అందుకే వృద్ధాప్యం మీద పడ్డా వృద్ధులకు వచ్చే నెలకు రూ.వెయ్యి పింఛన్‌కు దరఖాస్తు చేయలేదు. గౌరవ వేతనం అందిస్తే ఈ చరమాంకంలో జీవితం సజావుగా సాగుతుంది. అందుకున్న పురస్కారాలివీ.. 2014లో ప్రపంచ జానపద దినోత్సవంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం, రూ.10,116 నగదు 2015 ఏప్రిల్‌లో పాలమూరు కళారూపాల ప్రదర్శనలో కలెక్టర్ టీకే.శ్రీదేవి నుంచి కళాభినందన పత్రం 2015లో హైదరాబాద్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ నుంచి రూ.5 వేల నగదు పురస్కారం 2016 పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి రూ.20,116, ప్రశంసా పత్రం -
6న ‘హమాలీ’ జిల్లా మహాసభలు
జోగిపేట: ఈ నెల 6వ తేదిన జోగిపేట పట్టణంలో హమాలీ సంఘం జిల్లా మహాసభలను నిర్వహించనున్నట్లు సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మొగులయ్య అన్నారు. మంగళవారం జోగిపేట మార్కెట్ యార్డు ఆవరణలో హమాలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో పని చేస్తున్న హమాలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో 100కుపైగా గోదాములను నిర్మించినా ప్రభుత్వం వాటిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో హమాలీలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హమాలీలకు కనీస వేతనం, ఉద్యోగభద్రత, ప్రమాదబీమా, డబుల్బెడ్రూం ఇళ్లు, వారి పిల్లలకు కార్పొరేట్ ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. జోగిపేటలో జరిగే మహాసభలకు హమాలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జోగిపేట హమాలీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్తెయ్య, నర్సింలు, నాయకులు మాణయ్య, శ్రీనివాస్, వెంకట్, పోచయ్య పాల్గొన్నారు. -
2.40 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. గురువారం ఉదయం పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి వస్తున్న బొలెరోను సోదా చేయగా అందులో 2.40 క్వింటాళ్ల గంజాయి బయటపడింది. ఇందుకు సంబంధించి వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిజామాబాద్, విశాఖ జిల్లాలకు చెందిన వీరంతా గంజాయిని అక్రమంగా నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు సీఐ మొగులయ్య తెలిపారు. -
మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ
మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం అవుసలోనికుంట గ్రామానికి చెందిన అరుదైన పన్నెండుమెట్ల కిన్నెర వాద్యకారుడు, గాయకుడు మొగులయ్య హైదరాబాద్ సిటీజనుల కోసం కచేరీ ఇవ్వనున్నారు. దక్కను ప్రాంతంలో ఒకప్పుడు ప్రసిద్ధవాద్యమైన కిన్నెర.. ఎలక్ట్రానిక్ వాద్యాల ప్రభావంతో ఇప్పుడు అత్యంత అరుదైన వాద్యంగా మారింది. దీనిని వాయించే కళాకారులు సైతం చాలా అరుదు. మొగులయ్య కచేరీ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సెప్టెంబర్ 11న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. దీనికి ప్రవేశం ఉచితం. - సాక్షి, సిటీప్లస్