Balagam Movie Singer Mogulaiah Hospitalized Due To Health Condition - Sakshi
Sakshi News home page

 రెండు కిడ్నీలు ఫెయిల్‌..కనిపించని కళ్లు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ‘బలగం’ మొగిలయ్య దీనస్థితి

Published Fri, Mar 31 2023 7:24 AM | Last Updated on Fri, Mar 31 2023 8:47 AM

Balagam Movie Singer Mogulaiah Hospitalized Due To Health Condition - Sakshi

బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులైన ఈ దంపతులకు వారసత్వంగా వచ్చిన తంబూర, దిమ్మస తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు.

(చదవండి: తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ సింగర్‌..స్పందించిన మంత్రి)

రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డ మొగిలయ్య ఏడాది క్రితం ఉన్నట్టుండి ఓరోజు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు వరంగల్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14 లక్షల వరకు ఖర్చయ్యాయి. రూ.10 లక్షల వరకు అప్పు చేశారు.

బలగం డైరెక్టర్‌ వేణు కొంత సాయం చేసినా సరిపోని పరిస్థితి. మొగిలయ్య డయాలసిస్‌ చేయించుకుంటున్న సమయంలోనే బలగం సినిమాలో అవకాశం వచ్చింది. ‘బీపీ, షుగర్‌ పెరగడంతో రెండు కళ్లు కనిపించడంలేదు. ఆపరేషన్‌ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మనసున్న మారాజులు ఆదుకోవాలి’అని కొమురమ్మ వేడుకుంటోంది.  
– వరంగల్‌ డెస్క్‌ 


ఆర్థికసాయం చేయదల్చిన వారు 
పస్తం కొమురమ్మ  
బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌: 62306309034 
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దుగ్గొండి, వరంగల్‌ జిల్లా 
ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ :  SBIN0020655 
గూగుల్‌పే నంబర్‌: 90590 98236  
ఫోన్‌పే నంబర్‌ : 91772 54408

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement