komuramma
-
కష్టాల్లో ‘బలగం’ మొగిలయ్య.. డబ్బుల్లేక దీనంగా వేడుకోలు
బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులైన ఈ దంపతులకు వారసత్వంగా వచ్చిన తంబూర, దిమ్మస తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. (చదవండి: తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ సింగర్..స్పందించిన మంత్రి) రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డ మొగిలయ్య ఏడాది క్రితం ఉన్నట్టుండి ఓరోజు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు వరంగల్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14 లక్షల వరకు ఖర్చయ్యాయి. రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా సరిపోని పరిస్థితి. మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలోనే బలగం సినిమాలో అవకాశం వచ్చింది. ‘బీపీ, షుగర్ పెరగడంతో రెండు కళ్లు కనిపించడంలేదు. ఆపరేషన్ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మనసున్న మారాజులు ఆదుకోవాలి’అని కొమురమ్మ వేడుకుంటోంది. – వరంగల్ డెస్క్ ఆర్థికసాయం చేయదల్చిన వారు పస్తం కొమురమ్మ బ్యాంక్ అకౌంట్ నంబర్: 62306309034 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, దుగ్గొండి, వరంగల్ జిల్లా ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0020655 గూగుల్‌పే నంబర్: 90590 98236 ఫోన్‌పే నంబర్ : 91772 54408 -
తొలితరం ఉద్యమ మహిళ
సందర్భం జూన్ 6న రిపబ్లిక్ చానల్, టైమ్స్ నౌ లేఖల దుమారం మొదలైన రోజుల్లోనే కొమురమ్మ మహబూబాబాద్‌లో చనిపోయిన వార్త తెలిసింది. తేరుకున్నపుడు ఆమె జ్ఞాపకాలు ముసురుకుం టూనే ఉన్నాయి గానీ రాయడానికి వీలు కాలేదు. మేము సికింద్రాబాద్ కుట్ర కేసులో సహ ముద్దాయిలం. సీపీఐఎంఎల్íసీఓసీ వరంగల్ జిల్లా తొలి నాయకులలో ఒకరైన బర్ల యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్మోహన్రెడ్డి, స్నేహలతల దళంలో వెంకటయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వినేవాళ్లం. 1974 మే 18న హనుమకొండలో అరెస్టు చేసి మే 20న నన్ను మరో నలుగురు విప్లవ రచయితలను సికింద్రాబాద్ మేజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచినపుడు ఇచ్చిన ఎఫ్ఐ ఆర్‌లో కోటగిరి వెంకటయ్య, కొమురమ్మల పేర్లను చూశాం. ఎమర్జెన్సీ కాలంలో విరసం కార్యవర్గ సభ్యులం దరినీ మీసా కింద అరెస్టుచేసి రాష్ట్రం లోని ఆయా జైళ్లలో డిటెన్యూలుగా ఉంచారు. అట్లా మేం వరంగల్ జైలులో ఉండగా కొమురమ్మ అరెస్టయి ఇదే ఆవరణలోని మహిళా జైలుకు వచ్చిందని జైలు జవాన్ల ద్వారా తెలిసింది. అంతకుముందే కృష్ణానదీ తీరాన మంగళగిరి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కోటగిరి వెంకటయ్య మరణించినట్లు పత్రికల్లో చదివాం. అప్పటికి ఆమె గర్భవతి. రహస్యప్రదేశంలో ఉన్నపుడు కోటగిరి వెంకటయ్యను, ఆమెను అరెస్టు చేశారని, ఇద్దరినీ వేరుచేసి ఆయనను ఎన్కౌంటర్ పేరుతో చంపేసి, ఆమె కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నందున అరెస్టు చేసి వరంగల్ జైలుకు తీసుకువచ్చారని తరువాత కాలంలో తెలిసింది. కొమురమ్మ జైలులోనే ప్రసవించింది. ఆమె పాప జైలులోనే పెరిగింది. 1976–77లో మేం చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు సికింద్రాబాద్ కుట్రకేసు విచారణకు స్పెషల్ కోర్టుకు తీసుకెళ్లేవాళ్లు. ఈ కేసు విచారణ కోసమే కొమురమ్మను కూడా చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటికే ఆ జైలులో డిటెన్యూలుగా విప్లవ రాజకీయ ఖైదీలుగా డా. వీణా శత్రుజ్ఞ, పీఓడబ్లూ్ల్య అధ్యక్షురాలు కె.లలిత, కరపత్రాలు పంచుతూ అరెస్టయిన పీఓడబ్లూ్ల్య అంబిక, స్వర్ణలత(అమరుడు మధుసూదన్రాజ్ సహచరి)ల సహచర్యం, ఆదరణ వల్ల కొమురమ్మ, ఆమె పాపకు కాస్త ఆరోగ్యం సమకూరి తేరుకున్నట్లున్నది. కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లేప్పుడే మొదటిసారి ఆమెను ఎస్కార్ట్ వ్యానులో చూడగలిగాను. ఆజానుబాహువు. దృఢకాయం. గంభీరమైన వ్యక్తిత్వం. ఎమర్జెన్సీ ఎత్తివేసి ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణంలో రాజకీయ ఖైదీలతోపాటు కొమురమ్మ కూడా విడుదలై మహబూబాబాద్ ప్రాంతంలో ప్రజాఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. వరంగల్‌లో రాడికల్ విద్యార్థి సంఘం రెండో మహాసభలు(1978 ఫిబ్రవరి), గుంటూరులో రాడికల్ యువజన సంఘం ఆవిర్భావ మహాసభలు (1978 మే) జరిగి ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రామాలు తిరిగే సందర్భంలో కొమురమ్మ రాడికల్ యువజన సంఘంలో పనిచేసింది. ఆమె పాపను స్నేహలత అనే పేరు పెట్టి హనుమకొండ హాస్టల్లో చేర్చాం. మహబూబాబాద్‌కు దగ్గరలోని కేసముద్రంలో రాడికల్ యువజన సంఘం సభలు కొమురమ్మ ఆధ్వర్యంలోనే జరి గాయి. వేలాదిమంది విద్యార్థి, యువజనులు, రైతాంగం తరలివచ్చారు. సభలో కొమురమ్మ కూడా వక్త. 1989 ఫిబ్రవరిలో సికింద్రాబాద్ కుట్రకేసులో తీర్పు సందర్భంగా, బతి కుండి బహిరంగ జీవితంలో ఉన్న ముద్దాయిలందరం కలుసుకున్నాం. కేసు కొట్టివేసి మా అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. అప్పటికే కొమురమ్మ జీవితంలో చాలా కష్టాలు, విషాదాలు అనుభవించింది. చాలా విరా మం తరువాత ఆఖరుసారి ఆమెను 2015 జనవరి 27న కవి విమల ఇంటిలో కలవగలిగాను. సుప్రసిద్ధ చరిత్ర రచయిత ప్రొ‘‘ ఉమా చక్రవర్తి మహిళా రాజకీయ ఖైదీల మీద డాక్యుమెంటరీ చేయదలుచుకుని కొమురమ్మను పిలిపించింది. ఆమె కష్ట సుఖాలు, ఆమె కుటుంబం గురించి విని చాలా బాధ కలిగింది. మళ్లీ ఒకసారి వచ్చి తన సమస్యలన్నీ చెప్పుకుంటానని తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది కానీ రాలేకపోయింది. ఆ సమస్యలతో, అనారోగ్యం తోనే బహుశా మరణించి ఉంటుంది. మహబూబాబాద్‌లోని విప్లవ అభిమానులు, ప్రజాసంఘాలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారని ప్రజాసంఘాల కార్యకర్తల ద్వారా తెలిసింది. ఆమె కుటుం బానికి సంతాపం, ఆమె కోసం అశ్రునయనాల జోహార్లు చెప్పడానికి ఇంత ఆలస్యమైంది. వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు వరవరరావు -
జాతరలో తూటా కలకలం
-
జాతరలో తూటా కలకలం
పేలిన తూటాపై అంతు చిక్కని పోలీస్ రహస్యం పేలింది జంపన్న వాగు వద్దనా..!చిలకలగుట్ట కాడనా...! హడావుడిగా బుల్లెట్ తీసుకున్న డీఎస్పీ ఎక్కడా చెప్పొద్దంటూ హెచ్చరికలు హన్మకొండ, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో పోలీసుల తుపాకీ పేలింది.. పోలీసుల అత్యుత్సాహం కారణంగా జంపన్నవాగు వద్ద ఓ డీఎస్పీ గన్‌మెన్ తుపాకీ మిస్ ఫైర్ అరుుననట్లు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. చిలుకలగుట్ట వద్ద పైకి పేల్చిన తూటా కిందకు వచ్చి తాకిందని కొందరు, జంపన్న వాగు వద్ద మిస్‌ఫైర్ అయిందని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం మేడారం మహాజాతరలో అధికార వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మేడారం జాతరలో భాగంగా పోలీసుల తూటాకు గురువారం ములుగు మండలం అడవిమల్లంపల్లికి చెందిన ఆర్షం కొమురమ్మ(78) గాయపడింది. చీకటి పడుతున్న వేళ జంపన్నవాగు సమీపంలోని రెండు తాటిచెట్ల వద్ద వేసుకున్న గుడారం ఎదుట కొమురమ్మ సేద తీరుతుండగా తలకు బుల్లెట్ గాయమైంది. తలలోకి బుల్లెట్ కొంతమేర చొచ్చుకుపోయి చీల్చినట్లు తెలిసింది. ఆమెను మేడారం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అరుుతే అప్పటికే కొమురమ్మ కుమారుడు బుల్లెట్‌ను తీసుకోవడంతో ఎవరో కచ్చితంగా చెప్పినట్లుగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ముందుగా బాధితురాలి కుమారుడిని పిలిచి ‘ఇది పోలీసుల బుల్లెట్... మీ దగ్గర ఉండొద్దు... మేడం వస్తున్నారు...’ అంటూ ఆ బుల్లెట్‌ను తీసుకునే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడుతుండగానే మహిళా డీఎస్పీ అక్కడకు చేరుకుని బుల్లెట్ తీసుకుని బాధితురాలిని తన వాహనంలోనే గద్దెల వద్ద ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కొమురమ్మకు చికిత్సచేసి తలకు నాలుగు కుట్లు వేశారు. కొద్దిసేపు అక్కడే ఉంచుకుని తిరిగి పంపించారు. గోప్యంగా ఘటన.. పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా దాచి పెడుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసుల తుపాకీ ఎక్కడ పేలిందనే విషయాన్ని రహస్యంగా ఉంచారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాసు ప్రభుత్వపరంగా గౌరవ వందనం చేసే సందర్భంలో ఏకే-47 నుంచి బయటకు వెళ్లిన తూటా తాకిందని కొందరు పోలీసులు చెబుతున్నారు. జంపన్నవాగు వద్ద డీఎస్పీ గన్‌మన్ తుపాకీ పేలిందని మరికొందరు పేర్కొంటున్నారు. సదరు డీఎస్పీ జంపన్నవాగు వద్దకు వస్తున్న క్రమంలో గన్మెన్లు అత్యుత్సాహం చూపించారని, తుపాకులను ఎక్కుపెట్టి భక్తులను బెదిరించారని తెలుస్తోంది. దీంతో ఓ గన్‌మెన్ చేతిలోని తుపాకీ పేలడంతో రోడ్డు పక్కన గుడారంలో ఉన్న కొమురమ్మకు తూటా తగిలిందని ప్రచారం జరుగుతోంది. ఈ తూటా అంతే స్పీడ్‌తో తగిలితే... ప్రాణాలు పోయేవని అంటున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం ఎస్పీ కాళిదాసు పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి కొమురమ్మకు తాకిందని చెబుతున్నారు. కానీ.. చిలుకలగుట్టలో పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి జంపన్నవాగు వద్ద గుడారం ముందున్న కొమురమ్మకు తాకిందంటే నమ్మశక్యంగా లేదు. అంతేగాక సమ్మక్కను తీసుకొచ్చిన నేపథ్యంలో ముందుగా సాయంత్రం 5.39 గంటలకు, రెండోసారి 5.42 గంటలకు, మూడోసారి 5.55 గంటలకు ఫైరింగ్ చేశారు. కానీ కొమురమ్మకు చీకటిపడిన తర్వాత తూటా తగిలిం దని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పోలీసులు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. ఇదిలా ఉండగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక గద్దెల వద్ద ప్రభుత్వ వైద్యులకు కూడా ఇలాగే హెచ్చరికలు జారీచేయడంతో... వారు కూడా నోరు మెదపడం లేదు. గురువారం రాత్రి పోలీసు వాహనంలో ఓ ముసలావిడను తీసుకొచ్చారని, ఆమె తలకు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయని, కుట్లు వేశామని కిందిస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు.