Harish Rao Responds on Balagam Singer Mogulaiah Health Condition - Sakshi
Sakshi News home page

Mogulaiah: కిడ్నీలు ఫెయిల్‌, రెండు కళ్లు కనిపించని స్థితిలో సింగర్‌.. స్పందించిన మంత్రి

Published Thu, Mar 30 2023 2:46 PM | Last Updated on Thu, Mar 30 2023 6:58 PM

Harish Rao Responds on Balagam Singer Mogulaiah Health Condition - Sakshi

గత కొంతకాలంగా అందరూ బలగం సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో అందరినీ కంటతడి పెట్టించిన సన్నివేశం ఏదైనా ఉందంటే అది క్లైమాక్సే! కొమురవ్వ, మొగిలయ్యలు బుర్రకథతో రక్తసంబంధ విలువను చాటిచెప్పేలా గొంతెత్తి పాడుతూ ప్రేక్షకులను ఏడిపించేశారు. కానీ ఈ దంపతులు ప్రస్తుతం కన్నీళ్లతో సావాసం చేస్తున్నారు.

కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు. కిడ్నీలు పాడై డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు మొగిలయ్యకు అండగా ఉంటామన్నారు. మొగిలయ్యను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్నిరకాల పరీక్షలు చేసి అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయనకు డయాలసిస్‌ సహా మెరుగైన వైద్యం అందించి, మందులు ఇవ్వాలని తెలిపారు.

కాగా మొగిలయ్య కొంతకాలంగా షుగర్‌, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవడంతో వరంగల్‌లో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. బీపీ, షుగర్‌ పెరగడంతో ఆ ఎఫెక్ట్‌ కళ్లపై పడింది. ఇప్పుడు రెండు కళ్లు కూడా కనిపించడం లేదు. ఇటీవల దర్శకుడు వేణు మొగిలయ్య ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement