
మొగులయ్య కిన్నెర వాద్య కచేరీ
మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం అవుసలోనికుంట గ్రామానికి చెందిన అరుదైన పన్నెండుమెట్ల కిన్నెర వాద్యకారుడు, గాయకుడు మొగులయ్య హైదరాబాద్ సిటీజనుల కోసం కచేరీ ఇవ్వనున్నారు. దక్కను ప్రాంతంలో ఒకప్పుడు ప్రసిద్ధవాద్యమైన కిన్నెర.. ఎలక్ట్రానిక్ వాద్యాల ప్రభావంతో ఇప్పుడు అత్యంత అరుదైన వాద్యంగా మారింది. దీనిని వాయించే కళాకారులు సైతం చాలా అరుదు. మొగులయ్య కచేరీ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సెప్టెంబర్ 11న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. దీనికి ప్రవేశం ఉచితం.
- సాక్షి, సిటీప్లస్