Kinnera Mogulaiah
-
మంచి మనసు చాటుకున్న జ్యోతిరాయ్
-
కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
బుల్లితెర నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఆమె మరింత పాపులర్ అయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా మెప్పిస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో ఆమె ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఆమె పర్సనల్ వీడియో లీక్ అంటూ కన్నడ పరిశ్రమలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని ఆమె తిప్పికొట్టింది. అక్షయ తృతీయ సందర్భంగా అందరూ బంగారం కొంటారు. కానీ, జ్యోతీరాయ్ ఆ డబ్బుతో పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసు చాటుకుంది.కిన్నెర మొగిలయ్యకు సాయంతెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మ శ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే, పేదరికంతో ఉన్న మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పించన్ ఆగిపోవడంతో కొద్దిరోజుల నుంచి కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొగిలయ్యను తన టీమ్ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలచివేసిందని ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె తెలిపింది. అనంతరం మొగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్ ఆశీర్వాదం తీసుకుంది. మొగిలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది. అమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జ్యోతిరాయ్ మంచి మనుసును మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పర్సనల్ వీడియో లీక్‌పై ఫస్ట్ రియాక్షన్కొద్దిరోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అంటూ కన్నడ సోషల్ మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి. ఆమెను కొందరు కావాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిసింది. అయితే తొలిసారి తన సోషల్ మీడియా ద్వారా ఈ అంశం మీద రియాక్ట్ అయింది.'నా పేరుతో ఒక వీడియోను క్రియేట్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. ఇదీ ఎంత వరకు కరెక్ట్..? చదువు, సంపాదలేని కొందరు వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లందరూ చిల్లరగాళ్లు. నన్ను కొందరు కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చీకట్లోకి నెట్టాలని చూస్తున్నారు. నన్ను ఎంతలా అణిచివేసినా కూడా ఫీనిక్స్ పక్షిలా మళ్లీ తిరిగి వస్తాను. అని జ్యోతిరాయ్ తెలిపింది. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
-
పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024 బీఆర్ఎస్ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.కేటీఆర్ స్పందనతాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. Thanks Sucheta Ji for bringing this news to my attention I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6— KTR (@KTRBRS) May 3, 2024 -
మొగులయ్యకు ఇచ్చే స్థలం అంత దూరమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసంతృప్తి!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై అచ్చంపేట(నాగర్‌కర్నూల్) బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇవాళ కొందరికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ప్రముఖ కళాకారుడు.. కిన్నెర వాయిద్యకారుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు .. బీఎన్‌రెడ్డి కాలనీలో స్థలం కేటాయించారు. గతంలో మొగులయ్యను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకొచ్చినప్పుడు.. ఇళ్ల స్థలం కేటాయింపజేసే బాధ్యతను గువ్వల బాలరాజుకు అప్పగించారు సీఎం. అయితే ఇవ్వాళ్టి ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీకి అసలు తనని పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు గువ్వల బాలరాజు. మొగులయ్యను ఢిల్లీ తీసుకెళ్లి ఆయన కళను గుర్తు చేసింది తానేనని, ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని బాలరాజు గుర్తు చేశారు. కొందరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మొగులయ్యకు మాత్రం BN రెడ్డి కాలనీలో కేటాయించడం సరికాదని, క్రీడాకారులకు కేటాయించిన జాగలతో పోలిస్తే.. మొగులయ్యకు కేటాయించిన స్థలం విలువ తక్కువని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు. -
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ షూటర్ ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు వివిధ క్రీడాపోటీల్లో తెలంగాణ ప్రతిభను చాటి చెప్పారని, వారికి రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వ నజరానాతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్య ప్రతిభను తెలంగాణ ప్రభుత్వమే తొలుత గుర్తించి గౌరవించిందని అన్నారు. ఆయనకు కుటుంబ పోషణకోసం నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కిన్నెర కళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తరువాతే కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. తదనుగుణంగా ఆయన కోరుకున్న చోట ఇంటి స్థలం ఇస్తున్నామని తెలిపారు. కాగా, తన కళను గుర్తించి గౌరవించడంతో పాటు ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కిన్నెర మొగిలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరికి జూబ్లీహిల్స్.. మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లోనా? పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయింపుపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని, స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులు, కళాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో స్థలాలు ఇచ్చారని, మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, తదనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడంపై మాత్రమే మంత్రి సహాయక సిబ్బందిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. -
కిన్నెర మొగిలయ్యకు రూ. కోటి, హైదరాబాద్‌లో ఇంటిస్థలంపై ఉత్తర్వులు జారీ
కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు(కిన్నెర మొగిలయ్య) రూ. కోటి నగదు ఇవ్వాలని తాజాగా కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు బీఎన్ రెడ్డి నగర్లో మొగిలయ్యకు ఇంటి స్థలం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు నగదు, ఇంటి స్థలం అందించాల్సిందిగా కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం కాగా తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగిలయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ఆయన ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగిలయ్యను సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆయనకు 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: ఆ హీరో ‘మై డార్లింగ్’.. తన ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పిన రణ్‌బీర్ -
నా కళను అవమాన పరుస్తున్నారు: కిన్నెర మొగులయ్య
-
నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: మొగులయ్య
తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగులయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. అయితే తాజాగా అతడు తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు. 'నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మొన్నామధ్య పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు ఇస్తున్నడా? అని నాతో గొడవపడ్డారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట. నాకు ఆ పతకం అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ ఎవరిదైనా సరే అది తిరిగి ఇచ్చేస్తా. కానీ పేదోడిని అయిన నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది' అని ఆవేదన వ్యక్తం చేశాడు మొగులయ్య. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు -
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం
కిన్నెర వాయిద్యకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన రెండో కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే..మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది. మంగళవారం ఓ గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
వెయ్యి రూపాయలు లేక భార్య, కొడుకు చనిపోయారు: మొగులయ్య
మొగులయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే.. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయన జీవితం పూలపాన్పు కాదు.. ముళ్ల దారి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చవిచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. 'నేను చాలా బీదవాడిని. వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బస్టాండ్లల్ల డబ్బులు అడుక్కుంటూ సరిగా తిండి లేక చివరాఖరికి చేనిపోయింది. ఆమె చనిపోయాక కూడా శవాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గతి లేదు. విషయం తెలుసుకుని కేవీ రమణాచారి గారు 10 వేల రూపాయలు ఇస్తే అప్పుడు బండి కిరాయి కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. సరిగా తిండి లేక మూడేండ్ల కిందట చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. మొన్న మా కొడుకు గుండెలో నీరొచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ కళను బతికించాలన్నదే నా కోరిక' అని మొగులయ్య పేర్కొన్నాడు. -
ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ వసతి కల్పించింది. ఇటీవల ఆయన ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ, సమాజంతో ఆ బస్సుకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ పాట పాడారు. దానికి మంచి స్పందన రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఆశువుగా ఓ పాట పాడారు. కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa — Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021 లక్షకు పైగా వ్యూస్ రావటంతో దాన్ని ఆర్టీసీ గుర్తించింది. సంస్థకు సానుకూల ప్రచారం చేసినందుకు మొగులయ్యను అభినందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్‌భవన్‌లో బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ కోరారు. చదవండి: ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ