కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు(కిన్నెర మొగిలయ్య) రూ. కోటి నగదు ఇవ్వాలని తాజాగా కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు బీఎన్ రెడ్డి నగర్‌లో మొగిలయ్యకు ఇంటి స్థలం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు నగదు, ఇంటి స్థలం అందించాల్సిందిగా కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం
కాగా తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగిలయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ఆయన ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగిలయ్యను సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆయనకు 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
చదవండి: ఆ హీరో ‘మై డార్లింగ్’.. తన ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పిన రణ్‌బీర్
Comments
Please login to add a commentAdd a comment