మొగులయ్యకు ఉచిత బస్‌పాస్ అందజేస్తున్న సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ వసతి కల్పించింది. ఇటీవల ఆయన ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ, సమాజంతో ఆ బస్సుకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ పాట పాడారు. దానికి మంచి స్పందన రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఆశువుగా ఓ పాట పాడారు. కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది.
చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్
కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021
లక్షకు పైగా వ్యూస్ రావటంతో దాన్ని ఆర్టీసీ గుర్తించింది. సంస్థకు సానుకూల ప్రచారం చేసినందుకు మొగులయ్యను అభినందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్‌భవన్‌లో బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ కోరారు.
చదవండి: ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment