Free bus pass
-
మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు ఉచిత పాస్‌ల పంపిణీకి ఆర్టీసీ ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: ఈనెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల నుంచి కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. పాస్‌లు పొందితే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నిత్యం వచ్చివెళ్లేందుకు బస్‌పాస్‌లు అవసరంతో ఉచిత రాయితీ పాస్‌లు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లుచేసింది. ఉచిత పాసులు ఇలా.. గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పల్లె వెలుగు బస్సుల్లో 12 ఏళ్ల లోపు(బాలురు) విద్యార్థులంతా 20 కి.మీ దూరం వరకు పాఠశాలకు వెళ్లిరావడానికి రోజు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకునే బాలికల కోసం ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ పాస్‌కోసం ఇంట్లో నుంచి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పైసా ఖర్చులేకుండా వెబ్సైట్లో అడిగిన వివరాలు పొందుపర్చి ఫొటో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. www.online.tsrtcpass. in వెబ్సైట్లో రిజిష్టర్ అయితే నమోదు సంఖ్య వస్తుంది. దాన్ని పాస్ కౌంటర్లోని సిబ్బందికి తెలియజేస్తే బస్‌పాస్ పొందవచ్చు. తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థలు అంగీకరిస్తేనే పాస్ జారీ అవుతుంది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.50 చెల్లిస్తే బస్‌పాస్ అందిస్తారు. 35 కి.మీ లోపు రాయితీ పాసులు మంత్లీ స్టూడెంట్ బస్‌పాస్ రాయితీ కూడిన విద్యార్థులు చార్జీలు కేటాయించారు. ప్రైవేట్ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలురతోపాటు కళాశాలల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉన్నా బస్‌పాస్‌లకు కి.మీ చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. గుర్తింపుకార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 12 ఏళ్లలోపు బాలురు ఉచిత బస్‌పాస్ ధర రూ.30, 18 ఏళ్లలోపు బాలికలకు ధర రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు ప్రయోజనం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. అంతకుమించి ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు చెల్లించాలి. విద్యార్థులకు బస్‌పాసులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం బస్‌స్టేషన్‌లో బస్‌పాసు కౌంటర్ ఏర్పాటు చేశాం. వివరాలకు 9985445438లో సంప్రదించవచ్చు. – రవీంద్రనాథ్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల ఎంతో ప్రయోజనం.. తమ విద్యార్థులకు బస్‌పాసులు మంజూరు చేయాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు రూపంలో నగదు చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ప్రత్యేకంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ కేటాయిస్తుంది. తమ పాఠశాలల్లోని 12 ఏళ్లలోపు బాలురు, పదోతరగతి వరకు బాలికలు ఉచిత పాసులు పొందాలన్నా ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీకి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ఆర్టీసీ ఆదిలాబాద్ పేరిట డీడీలను తీసి సమీపంలోని డిపోల్లో అందజేయాల్సి ఉంటుంది. 200 మంది లోపు విద్యార్థులున్నా పాత, కొత్త ప్రైవేట్ పాఠశాలలు రూ.700, 500లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు రూ.1000, 500 మంది పైన విద్యార్థులున్నా పాఠశాలలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు (రెన్యూవల్) రూ.1500, ఆడ్మిస్టేటివ్ చార్జీలు (ఫ్రెష్) కింద రూ.2వేలు చెల్లించాలి. డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు రూ.6వేలు (కొత్తవి), రెన్యూవల్ కోసం రూ.5వేలు చెల్లించాలి. జూనియర్, డిప్లొమా, ఒకేషనల్ యాజమాన్యాలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు కింద రూ.5వేలు, రెన్యూవల్ కోసం రూ.4 వేలు చెల్లించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు డీడీలు చెల్లించాలి విద్యార్థులకు ఉచిత పాస్‌లే కాకుండా రూట్‌పాస్ లు కూడా జారీ చేస్తారు. బస్‌పాసులు పొందడానికి విద్యాసంస్థలు ఆడ్మినిస్ట్రేటివ్ రుసుము చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దీని నుంచి మినహాయింపు ఉండగా ప్రైవేట్ సంస్థలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థను బట్టి వార్షిక రుసుము నిర్దేశించారు. రుసుము చెల్లించి అనుమతి పొందిన వారికే ఆర్టీసీ ఆన్లైన్లో చోటు లభిస్తోంది. దీని ఆధారంగా విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌ల జారీ కొనసాగనుంది. 3 నెలలు, 6 నెలలు ఇలా కాలపరిమితి కూడిన బస్‌పాస్‌లు కిలోమీటర్ బట్టి రాయితీతో పొందవచ్చు. -
విద్యార్థుల ప్రయాణం సురక్షితం.. సుఖవంతం
పాఠశాలలు.. కళాశాలలకు వెళ్లేందుకు.. తిరిగి ఇంటికి చేరేందుకు విద్యార్థులకు బెంగలేదిక. చదువు సమయం వృథా అవుతుందన్న ఆందోళన అవసరం లేదు. సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాయితీ ప్రయాణాలు కల్పిస్తూ... విద్యార్థుల బంగారు భవితకు పరోక్షంగా బాటలు వేస్తోంది. పార్వతీపురం టౌన్: ఆర్టీసీ సంస్థ సేవలను విస్తరిస్తోంది. ఓ వైపు ప్రయాణికులతో పాటు కార్గో సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అధిక ఆదాయం ఆర్జిస్తోంది. మరోవైపు విద్యార్థులకు సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యాలయాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది. రాయితీపై పాసులు జారీ చేస్తోంది. దీనివల్ల చదువు సమయం వృథా కాకుండా.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పరోక్షంగా సాయపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు రాకపోకలు సాగించే రూట్లలో ప్రత్యేక బస్‌సర్వీసులను నడుపుతూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రత్యేక సర్వీసులు ఇలా.. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 3, పాలకొండ నుంచి 5, సాలూరు డిపో నుంచి ఒక బస్సును పాఠశాల, కళాశాల వేళల్లో నడుపుతున్నారు. ఉచిత బస్‌పాస్‌లు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం లేకుండా చేస్తోంది. సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1800 ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. జిల్లాలోని 1,03,733 మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విద్యను అభ్యసించిన వారే. 12–18 ఏళ్లలోపు విద్యార్థులు 15,970 మందికి 60 శాతం రాయితీపై పాసులు జారీ చేశారు. అర్హులందరికీ ఉచిత పాసులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల పరిధిలోని 1800 మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసు లను అందజేశాం. 15, 970 మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని 9 విద్యార్థుల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎక్కువుగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అదనపు బస్సులను పంపించేందుకు చర్యలను చేపట్టాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం ఇబ్బందులు లేకుండా... గతంలో కళాశాలలకు రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సులలో నిలబడి వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు బస్సులు ఉండకపోవడంతో ఆటోలపై వెళ్లేవాళం. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాయితీతో బస్సు పాసులను అందజేసి సమయానికి ఇంటికి, పాఠశా లలకు, ఇళ్లకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. – సాయి, విద్యార్థి, పుట్టూరు, పార్వతీపురం మండలం సమయానికి చేరుకుంటున్నాం కళాశాలల సమయానికి చేరుకుంటున్నాం. ఆర్టీసీ మా ప్రాతం నుంచి పార్వతీపురం పట్టణానికి ప్రత్యేక బస్సు వేశారు. దీనివల్ల ఎటువంటి భయంలేకుండా సమయానికే పాఠశాలలకు చేరుకుంటున్నాం. పాఠశాల పూర్తయిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికే బస్సు దొరుకుతుంది. తొందరగా ఇళ్లకు చేరుకుంటున్నాం. – దేవి ప్రసాద్, కొత్తపల్లి, కురుపాం మండలం -
ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ వసతి కల్పించింది. ఇటీవల ఆయన ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ, సమాజంతో ఆ బస్సుకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ పాట పాడారు. దానికి మంచి స్పందన రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఆశువుగా ఓ పాట పాడారు. కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa — Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021 లక్షకు పైగా వ్యూస్ రావటంతో దాన్ని ఆర్టీసీ గుర్తించింది. సంస్థకు సానుకూల ప్రచారం చేసినందుకు మొగులయ్యను అభినందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్‌భవన్‌లో బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ కోరారు. చదవండి: ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ -
సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తనే స్వయంగా పరిశీలించడానికి శనివారం అకస్మాత్తుగా కాన్వాయ్ దిగి చెన్నైలోని కన్నగి నగర్ వైపు వెళ్తున్న సిటీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా సీఎం బస్సులోని ప్రయాణికులతో సంభాషించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం) తమిళనాడులో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎలా భావిస్తున్నారో స్టాలిన్ ప్రత్యేకంగా మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. నగరంలో వివిధ బస్సు సర్వీసుల గురించి ఫిర్యాదులు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ఇంకా ఎటువంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనల్ని పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ప్రయాణికులకు సీఎం స్టాలిన్ సూచించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. చదవండి: (బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం) అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే 400 పేజీల మేనిఫెస్టోలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ రంగంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలల నుంచి సంవత్సరానికి పెంచడం, ప్రసూతి సాయంగా రూ.24,000 అందించడం, మహిళలపై నేరాలను విచారించడానికి ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. -
మారుమూల పల్లెలకు బడిబస్సులు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న ఉచిత బస్సులపై గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సీఎం వైఎస్ జగన్ సర్కారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కళాశాల విద్యార్థులకు రాయితీ బస్‌పాస్ పరిధిని కూడా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెలకూ బడి బస్సులు నడుపుతోంది. మొత్తం మీద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తూ అందుకు రవాణా ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా డెడికేటెడ్ రవాణా సౌకర్యం కూడా కల్పించింది. దీంతో రాష్ట్రంలో టెన్త్ లేదా 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 12 ఏళ్లలోపు (ఏడో తరగతి) విద్యార్థులు ఉచితంగా బస్‌పాస్‌లు పొంది తమ చదువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 20 కి.మీ.లోపు.. పట్టణ, నగర ప్రాంతాల్లో 22 కి.మీ.లోపు ఉచిత ప్రయాణాన్ని కూడా ఆర్టీసీ విద్యార్థులకు కల్పిస్తోంది. మరోవైపు.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 80–90 శాతం వరకు రాయితీ బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులకు ఉచిత, రాయితీ పాస్లిచ్చినప్పటికీ ఆర్టీసీ సరిగ్గా బస్సులను నడిపేది కాదు. టీడీపీ హయాంలో అయితే ఆర్టీసీ బస్సులను డ్వాక్రా మహిళలను సభలకు తరలించేందుకు, పోలవరం యాత్రలకు పంపడమే తప్ప బడి బస్సులను ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. దీంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి నానా యాతన పడేవారు. బస్సుల కోసం విద్యార్థులు ధర్నాలు చేసిన ఘటనలున్నాయి. కానీ, వైఎస్ జగన్ సర్కారు వచ్చాక విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అన్ని రీజియన్ల నుంచి కేవలం పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసమే ఆర్టీసీ 480 డెడికేటెడ్ బస్సులకు శ్రీకారం చుట్టింది. రాయితీ బస్‌పాస్‌ల పరిధి పెంపు విద్యార్థులకు అందించే రాయితీ బస్‌పాస్‌లను గతంలో 35 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీంతో విద్యార్థులు అప్పట్లో నానా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో నెలకొన్నాయి. దీంతో విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కారణంగా రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగకరంగా ఉండేవి కావు. విద్యా సంస్థల బస్సుల్లో వెళ్లాలంటే రవాణా ఛార్జీలు అధికమయ్యేవి. విధిలేని పరిస్థితుల్లో షేర్ ఆటోల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ప్రయాణించే వారు. ఈ ఇబ్బందుల్ని గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 విద్యా సంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం లెక్కగట్టి ఆ మేరకు పరిధిని పెంచుతూ జీఓ జారీచేసింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. అలాగే, పరిధి పెంపుతో ప్రభుత్వంపై ఏటా 18.50 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడింది. బస్‌పాస్‌లకు వంద శాతం రీయింబర్స్మెంట్ ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఆర్టీసీ మొత్తం 57,042 ఉచిత, 76,099 రాయితీ బస్‌పాస్‌లను జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. ఇలా ఏటా రూ.450 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా, ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది 5 వేల మందికి కూడా సంస్థ ఉచిత పాస్‌లు అందించింది. అలాగే, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకూ వీటిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉచిత బస్‌పాస్‌తో చదువుకు ఆటంకాల్లేవు మాది పూర్తి గిరిజన ప్రాంతం పాడేరు వద్ద మారుమూల పల్లె. ప్రతిరోజూ పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే రానూపోను రూ.25 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఉచిత పాస్ ఇవ్వడంతో మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. – కె.లిఖిత, ఏడో తరగతి విద్యార్థిని, ములియపట్టు గ్రామం ప్రతీరోజూ ఠంఛనుగా బస్సు పాడేరు పరిధిలోని మా ఊరి నుంచి హుకుంపేట మండల కేంద్రంలో పాఠశాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు. ఆర్టీసీ బస్సు లేకపోతే నేను చదువు మానుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఠంఛనుగా ఆర్టీసీ బస్సు వస్తుండడంతో ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగిస్తున్నా. – పొంగి సంతోష్‌కుమార్, 8వ తరగతి, జోగులాపుట్ గ్రామం ఎలాంటి ఆటంకాల్లేకుండా నడుపుతున్నాం బడి బస్సులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుపుతున్నాం. విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో మారుమూల గ్రామాలకు బస్సుల్ని పంపుతున్నాం. – బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్) -
సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్‌పాస్‌లు
టీ.నగర్: సీనియర్ సిటిజన్లకు బుధవారం నుంచి మూడు నెలల పాటు ఉచిత బస్ పాసు, టోకెన్లు అందించే సౌకర్యం కల్పిస్తూ నగర రవాణా సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో నివశిస్తున్న సీనియర్ సిటిజన్లు నగర రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాసులు, టోకెన్లు కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఆయా డిపోల్లో అన్ని పనిదినాల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా వీటికోసం దరఖాస్తు చేసుకునేవారికి బుధవారం నుంచి ఉచిత బస్ పాసులు, టోకెన్లు లభిస్తాయని తెలిపారు. బ్రాడ్వే, సెంట్రల్ రైల్వే స్టేషన్, గిండి ఎస్టేట్, కేకే.నగర్, మందవెలి, వేలచ్చేరి, సైదాపేట సహా 42 కేంద్రాలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. -
‘ఇంటర్’కూ ఉచిత బస్‌పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా పని చేస్తూ దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండ పంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యం లో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇంటర్లో గతంలో లక్ష 25 వేల మంది విద్యార్థులుండగా, తమ ప్రభుత్వం వచ్చాక లక్ష 75వేలకు పెరిగిందని, వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచాలని కోరారు. కేసీఆర్ హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు జివో నంబర్ 16ను తీసుకువస్తే కొంత మంది కోర్టుకు పోవటంతో వారి క్రమబద్దీకరణ ఆగిపోయిందని, ఐతే ప్రభు త్వం వారి జీతాలను 37వేలకు పెంచింద న్నారు. కార్పొరేటర్ విద్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, అనేక ఇబ్బందు లకు గురౌతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని, అందుకే ప్రభుత్వ కాలేజీలను బలోపే తం చేయాలన్నారు. కస్తూరిభా గాంధీ విద్యాలయాలను(కేబీజీవీ) అప్‌గ్రేడ్ చేయా లని కేంద్రానికి నివేదిక పంపామని, అలా చేస్తే 475 కేబీజీవీలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ అవుతాయని, దీంతో విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకు పెరిగే అవ కాశం ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీలు మూత పడే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని అన్నారు. ప్రతిభ గల విద్యార్థుల కోసం పాత 10 జిల్లాల్లో జిల్లాకు 2 చొప్పున 20 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నీట్, జేఈఈ, ఎంసెట్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు కడియం వెల్లడించారు. 2018–19 విద్యా సంవత్సరానికి మెయింటనెన్స్ కింద కాలేజీ ఓపెనింగ్‌కు ముందు లక్ష రూపాయలు మంజూరు చేస్తామన్నారు. పరీక్షల సమయంలోనైనా అధ్యాపకులు హెడ్ క్వార్టర్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ అశోక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు ప్రిన్సిపల్స్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఫలితాల్లో సత్తా చాటాలి ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు తీసుకురావాల్సిన బాధ్యత బోధనా సిబ్బందిదేనని కడియం అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతులను విడతలవారీగా కల్పిస్తున్నామని, రెండేళ్లలో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లు, ల్యాబ్ మెటీరియల్, గేమ్స్–స్పోర్ట్స్ సామగ్రి, ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్ ల్యాబ్ తదితర వసతుల కోసం రూ.275 కోట్లు మంజూరు చేశామన్నారు. లెక్చరర్లు బాగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వీటిని చూసి వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలన్నారు. (విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం. చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ అశోక్) -
విద్యార్థులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తే...
విద్యాశాఖ ఆదేశాలు చెన్నై: ఎలాగోలా విద్యాసంస్థలకు చేరుకుందామని విపరీతాలకు పోయే విద్యార్దులకు విద్యాశాఖ కళ్లెం వేయనుంది. అలా బస్సుల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్‌పాస్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ హెచ్చరికలతో కూడిన ఆదేశాలను సోమవారం జారీచేసింది. చెన్నైలో జనాభా సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్య పెరగడం లేదు. బస్సు సర్వీసుల వేళల్లో సరైన విధానం కొరవడింది. ఇలాంటి అనేక కారణాలతో ఆఫీసులు, విద్యాసంస్థల కీలక వేళల్లో బస్సుల్లో రద్దీ భరించలేని విధంగా పెరిగింది. సరైన సమయానికి గమ్యం చేరాలన్న ఆతృతలో విద్యార్థులు రద్దీగా ఉండే బస్సులను సైతం వదలకుండా ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో బస్సు కిటికీలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తూ జారిపడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత ఏడాది జూలై 3వ తేదీన కున్రత్తూరుకు చెందిన విద్యార్థి జగదీష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో జారికింద పడ్డాడు. క్షణాల్లో బస్సు మళ్లీ బయల్దేరడంతో చక్రాల కింద నలిగి చనిపోయాడు. అలాగే గత ఏడాది డిసెంబరు 1వ తేదీన చెన్నై తాంబరానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థి సురేష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా పట్టుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఫుట్‌బోర్డు ప్రయాణంలో ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా విద్యార్దులు మాత్రం ప్రాణాంతకమైన ఈ విధానాన్ని మానడం లేదు. దీంతో గత ఏడాది ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే రూ.500 జరిమానా, తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు ఫిర్యాదు చేస్తామని, పదే పదే పట్టుబడితే టీసీ ఇచ్చి పంపేయాల్సిందిగా యాజమాన్యాలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కొన్నాళ్ల పాటూ పోలీసులకు భయపడి క్రమశిక్షణగా మెలిగిన విద్యార్థులు మళ్లీ పాత పద్ధతిని కొనసాగించడం ప్రారంభించారు. విద్యాశాఖ సంచాలకుల సర్య్కులర్ వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థు ఫుట్‌బోర్డు ప్రయాణాలు మళ్లీ మొదలైనాయి. ఈ సారి విద్యార్థుల ఆగడాలని అరికట్టే బాధ్యతను విద్యాశాఖే చేపట్టింది. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులను జారీచేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాక, ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు సైతం ఉచిత బస్‌పాస్‌కు అర్హులు. బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్సు పాస్‌లను రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఎస్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. ఫుట్‌బోర్డులో ప్రయాణించడం ఎంతటి ప్రమాదకరమో తెలియజెప్పేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశాలు నిర్వహించిన తరువాత కూడా విద్యార్దులు ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగించినపుడు మాత్రమే బస్‌పాస్‌ల రద్దు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. -
‘డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కొందరు బాధితులు చేసిన విన్నపం మేరకు ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లానని... సీఎం బస్పాసులివ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దాదాపు 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.