
టీ.నగర్: సీనియర్ సిటిజన్లకు బుధవారం నుంచి మూడు నెలల పాటు ఉచిత బస్ పాసు, టోకెన్లు అందించే సౌకర్యం కల్పిస్తూ నగర రవాణా సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో నివశిస్తున్న సీనియర్ సిటిజన్లు నగర రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాసులు, టోకెన్లు కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఆయా డిపోల్లో అన్ని పనిదినాల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా వీటికోసం దరఖాస్తు చేసుకునేవారికి బుధవారం నుంచి ఉచిత బస్ పాసులు, టోకెన్లు లభిస్తాయని తెలిపారు. బ్రాడ్వే, సెంట్రల్ రైల్వే స్టేషన్, గిండి ఎస్టేట్, కేకే.నగర్, మందవెలి, వేలచ్చేరి, సైదాపేట సహా 42 కేంద్రాలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment