Pawan Kalyan Bheemla Nayak Title Song Released: ‘భీమ్లా నాయక్’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది - Sakshi
Sakshi News home page

Bheemla Nayak Title Song: సెభాష్‌ భీమ్లా నాయకా... టైటిల్‌ సాంగ్‌ అదిరిందిగా

Published Thu, Sep 2 2021 11:16 AM | Last Updated on Thu, Sep 2 2021 3:08 PM

Pawan Kalyan Bheemla Nayak title song released - Sakshi

Bheemla Nayak Song Lyrics: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న  ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం.  పవన్ కల్యాణ్‌,  రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ  మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి  ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

కాగా ఈరోజు ఈ మూవీ నుంచి  బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేశారు.సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే జానపద గీతంతో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది

భీమ్లా నాయక్‌.. ఇరగదీసే ఈడీ ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనపెడితే వీడే పెద్ద గుండా..నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా.. అంటూ సాగే ఈ పాట.. భీమ్లా నాయక్‌ పుట్టుక, అతని క్యారెక్టర్‌ ఏంటో తెలియజేస్తుంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న  ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement