Bheemla Nayak Adavi Thalli Maata Song Singer Kummari Durgavva Remuneration - Sakshi
Sakshi News home page

Bheemla Nayak: 'అడవితల్లి మాట' పాట కోసం సింగర్‌ దుర్గవ్వ తీసుకున్న రెమ్యునరేషన్‌!

Published Thu, Feb 24 2022 12:27 PM | Last Updated on Thu, Feb 24 2022 1:49 PM

Kummari Durgavva About Her Remuneration For Bheemla Nayak Movie Song - Sakshi

కూలీ పనులు చేసుకుంటూ ఫోక్‌ సాంగ్స్‌ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది...

భీమ్లా నాయక్‌ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్‌ సాంగ్‌, సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్‌ సాంగ్స్‌ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది. 'సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్‌ అయ్యాయి. అది విని భీమ్లానాయక్‌లో పాట పాడమని ఆఫర్‌ వచ్చింది. ఐదారు నిమిషాల్లో పాడేశాను. ఈ పాట పాడినందుకు రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చింది దుర్గవ్వ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement