Bheemla Nayak Movie: Pawan Kalyan Bheemla Nayak Song Lala Bheemla Released - Sakshi
Sakshi News home page

Lala Bheemla: లాలా భీమ్లా ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..

Published Sun, Nov 7 2021 12:22 PM | Last Updated on Sun, Nov 7 2021 1:52 PM

Bheemla Nayak Movie: Pawan Kalyan Bheemla Nayak Song Lala Bheemla Released - Sakshi

Pawan Kalyan Bheemla Nayak Song Lala Bheemla: పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. పవన్‌ పాత్రను హైలైట్‌ చేస్తూ సాగిన ఈ పాటను డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రాశారు. ఆదివారం(నవంబర్‌7న) త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్‌ చేశారు. 

పవన్‌.సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement