Ram Charan Interesting Comments On Pawan Kalyan Bheemla Nayak Movie Trailer - Sakshi
Sakshi News home page

Ram Charan: ప్రతీ డైలాగ్​ పవర్​ ఫుల్​.. బాబాయ్​ ట్రైలర్​పై అబ్బాయి రివ్యూ

Published Wed, Feb 23 2022 12:48 PM | Last Updated on Wed, Feb 23 2022 1:29 PM

Ram Charan Response On Bheemla Nayak Trailer - Sakshi

Ram Charan Response On Bheemla Nayak Trailer: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల భారీ మల్టిస్టారర్‌ చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్‌' సినిమా ట్రైలర్​ను ఫిబ్రవరి 21న విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్​ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా బాబాయ్​ మూవీ ట్రైలర్​పై అబ్బాయి రామ్​ చరణ్ రివ్యూ ఇచ్చాడు. 



'భీమ్లా నాయక్​ ట్రైలర్​ ఎలక్ట్రిఫైయింగ్​గా ఉంది. పవన్​ కల్యాణ్​ గారి ప్రతీ డైలాగ్​, యాక్షన్​ పవర్​ఫుల్​గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్​గా ఉంది. త్రివిక్రమ్​, సాగర్​ కె చంద్ర, నిత్య మీనన్​, సితార ఎంటర్​టైన్​మెంట్స్​, తమన్​కు ఆల్​ ది బెస్ట్​' అంటూ ట్విటర్​ వేదికగా తెలిపాడు రామ్​ చరణ్​. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం భీమ్లా నాయక్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement