క్రేజీ ఆప్‌డేట్‌: ఇక వరుస సర్‌ప్రైజ్‌లతో రానా సందడి | Rana Daggubati look And Videos Coming Soon From Bheemla Nayak Movie | Sakshi
Sakshi News home page

Bheemla Nayak: ఇక వరుస సర్‌ప్రైజ్‌లతో రానా సందడి

Published Tue, Sep 14 2021 2:48 PM | Last Updated on Tue, Sep 14 2021 2:48 PM

Rana Daggubati look And Videos Coming Soon From Bheemla Nayak Movie - Sakshi

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి  సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి.  ప‌వన్ టీజర్, ఇంట్రో సాంగ్ ప్రకంపనాలు సృష్టించాయి. అయితే రానాకి సంబంధించి ఒక్క పోస్ట‌ర్, వీడియో కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో దగ్గుబాటి ఫ్యాన్స్‌ విమ‌ర్శ‌లు గుప్పించడంతో చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. . రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అని ప్రకటించింది.

చదవండి: సాయి తేజ్‌ ఐసీయూ వీడియో బయటకు రావడంపై హీరో నిఖిల్‌ ఫైర్‌

ఇదిలా ఉండగా ఈ మూవీలోని రానా సంబంధించిన వరసు అప్‌డేట్స్‌తో మేకర్స్‌ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ తాజా బజ్‌ ప్ర‌కారం రానా పాత్రకు సంబంధించిన ఓ వీడియో సెప్టెంబర్ 17 తర్వాత బయటకు రానుందట. ఈ టీజర్ సినిమాపై రెట్టింపు అంచ‌నాలు పెంచేలా ఉంటుంద‌ట‌. ఇక ఆ తర్వాత నుంచి రానాకు సంబంధించిన లుక్‌, ఫొటోలు, వీడియోలు వరుసగా సందడి చేయబోతున్నట్లు సోషల్‌ మీడియా ప్రచారం జరుగుతోంది. దీంతో రానా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాక వీటిపై మూవీ యూనిట్‌ ఒక్కొక్కటిగా అధికారిక ప్రకటన ఇవ్వనుందని సమాచారం. ఈగోయిస్టిక్ పెద్దమనిషికి, సిన్సియర్ పోలీసాఫీసర్‌కు మధ్య జరిగే టిట్ ఫర్ ట్యాట్ గేమ్‌ని భీమ్లా నాయ‌క్ చిత్రంలో చూపించ‌నున్నారు. బిజు పాత్రలో పవన్ .. పృథ్వీ పాత్రను రానా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దీనికి స్క్రీన్ ప్లే -మాటలు రాశారు. తమన్ సంగీతం అందించాడు. 

చదవండి: తలైవి: ‘మొదట్లో కేసు పెట్టారు.. ఇప్పుడు ప్రశంసిస్తున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement