Bheemla Nayak Shooting Location At Vikarabad | ఎగబడ్డ పవన్ అభిమానులు - Sakshi
Sakshi News home page

Bheemla Nayak: అక్కడ భీమ్లా నాయక్‌ షూటింగ్‌.. ఎగబడ్డ పవన్ ఫ్యాన్స్‌

Published Fri, Dec 17 2021 2:25 PM | Last Updated on Fri, Dec 17 2021 2:49 PM

Bheemla Nayak Latest Schedule Shooting At Vikarabad - Sakshi

Bheemla Nayak Shooting Location: పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో మల్లీస్టారర్‌గా వస్తోన్న చిత్రం భీమ్లా నాయక్‌. ఫాస్ట్‌ ఫాస్ట్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ శుక్రవారం (డిసెంబర్‌ 17) ఉదయం వికారాబాద్‌లోని మదన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఈ చోటులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సెట్‌లోకి పవన్‌ కల్యాణ్‌ అడుగుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. భారీగా లొకేషన్‌ వద్దకు చేరుకుని 'పవన్‌ కల్యాణ్‌.. పవన్ కల్యాణ్‌' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. 

పెద్ద సంఖ‍్యలో అభిమానులు రావడంతో సెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రానా డానియల్‌ పాత్రలో చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైలాగ్స్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్‌ చిత్రంలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ‍్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో హిట్‌ అయిన 'అయ్యప్పనుమ్‌ కోషీయమ్‌' సినిమాకు రీమెక్‌గా వస్తోంది 'భీమ్లా నాయక్‌'.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement