Pawan Kalyan-Rana: Huge Surprise From Pawan Kalyan Bheemla Nayak Movie To Fans - Sakshi
Sakshi News home page

Bheemla Nayak New Trailer: భీమ్లానాయక్‌ తాజా ట్రైలర్‌తో ఆ విమర్శలకు చెక్‌!

Published Thu, Feb 24 2022 12:06 AM | Last Updated on Thu, Feb 24 2022 2:00 PM

Huge Surprise From Pawan Kalyan Bheemla Nayak Movie - Sakshi

Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ రిలీజ్‌ ట్రైలర్‌లో భీమ్లా నాయక్‌, డేనియర్ శేఖర్ పాత్రల్లో పవన్‌ కల్యాణ్‌, రానాలు ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో ఉంది. చివర్లో పవన్‌ కల్యాణ్‌, రానాలు తలపడుతూ అదరగొట్టారు. ఇక ఈ ట్రైలర్‌లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలెట్‌గా నిలిచింది.

అయితే మునుపటి ట్రైలర్‌కు కొంత మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పాలి. దానికి సంబందించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ట్రైలర్‌ కట్‌కు సోషల్‌మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ తాజా రిలీజ్‌ ట్రైలర్‌తో ఆ విమర్శలకు చెక్‌ పెట్టింది చిత్ర యూనిట్‌. మొత్తంగా మునుపటి ట్రైలర్‌తో పోలిస్తే ఈ తాజా ట్రైలర్‌ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక దీంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement