దీపావళి ముందే వచ్చింది.. లాలా భీమ్లా అదరగొట్టిందంతే.. | Lala Bheemla Video Song Promo Out From Bheemla Nayak Movie | Sakshi
Sakshi News home page

Lala Bheemla: లాలా భీమ్లా వీడియో సాంగ్‌ ప్రోమో చూసేయండి

Published Wed, Nov 3 2021 8:31 PM | Last Updated on Wed, Nov 3 2021 8:31 PM

Lala Bheemla Video Song Promo Out From Bheemla Nayak Movie - Sakshi

మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని కూర్చుకున్నాడు పవన్‌. 'హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది..

మలయాళ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియం' తెలుగులో 'భీమ్లా నాయక్‌'గా రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే! పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ వీడియో ప్రోమోను వదిలారు. ఇందులో మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని కూర్చుకున్నాడు పవన్‌.

'హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి' అని పవన్‌ చెప్పే డైలాగ్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న  ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement