Pawan Kalyan’s Fierce Looks From Bheemla Nayak Goes Viral - Sakshi
Sakshi News home page

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌` బ్రేక్‌ టైమ్‌.. పవన్‌ ఆన్‌ ఫైర్

Published Sat, Aug 21 2021 12:20 PM | Last Updated on Mon, Sep 20 2021 11:39 AM

Bhima Nayak: Pawan Kalyan VIdeo Goes Viral - Sakshi

తుపాకి చేతపట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. టార్గెట్‌ని ఎయిమ్‌ చేస్తూ శత్రువులపై దాడికి సిద్ధమవుతున్నాడు. ఇదంతా పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని చిన్న బ్రేక్‌ టైమ్‌ వీడియో క్లిప్‌. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల టైటిల్‌ ఫస్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్ ని విడుదల చేయగా, అది రికార్డులు సృష్టించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీ ఉన్న పవన్‌కు  చిన్న విరామం దొరకడంతో గన్‌ చేతపట్టాడు.  దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌’ అని పేర్కొంది.

అందులో పవన్‌ తెల్ల దుస్తులు ధరించి కారు పక్కన తుపాకి పట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆయన అడవిలోకి తుపాకీ పట్టుకుని ఒంటరిగా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’తెలుగు రీమేకే ‘భీమ్లా నాయక్‌’.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement