
RGV Comments On Bheemla Nayak Trailer: రామ్ గోపాల వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన సైటిరికల్ కామెంట్స్‌తో నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్, ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఈ మధ్య వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి ఆర్జీవీ ఆయనపై కౌంటర్‌గా వరస ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు.
చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి
ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ అతడిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఫిబ్రవరి 21) విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ వర్మ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ మేరకు భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ కామెంట్ చేస్తూ.. ‘నిజాయితిగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత భీమ్లా నాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలని ఉందన అన్నాడు. ‘ఎందుకంటే బాహుబలి తర్వాత రానాకు ఉత్తరాదినా(బాలీవుడ్) పవన్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది. చదవండి: దర్శకుడిగా మారిన ఎడిటర్.. తుపాకీతో నిఖిల్ యాక్షన్
బాహుబలి తర్వాత రానాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో రానా విలన్‌గా కంటే కూడా హీరోగా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ‘భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ రానా పాపులారిటీ పెంచడానికే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోంది. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను’ అంటూ మరో ట్వీట్‌లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్‌పై వర్మ చేసిన కామెంట్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్జీవీకి తమదైన శైలిలో కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.