పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఆయన గౌరవార్థంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్‌తో పాటు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఈవెంట్‌ను నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఫిబ్రవరి 23 (బుధవారం) నాడు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment