![Is KTR Chief Guest To Bheemla Nayak Movie Pre Relese Event - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/19/bheemla-nayak.jpg.webp?itok=PX0H39mq)
Bheemla Nayak Pre Release Event: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన మల్టిస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర బృందం త్వరలో మూవీ ట్రైలర్ విడుదలకు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ-రిలీజ్ వేడుకకు డేట్ ఫిక్స్ చేశారని, దీనికి ముఖ్య అధితిగా తెలంగాణకు చెందిన ప్రముఖ మంత్రి రానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు
సోమవారం(ఫిబ్రవరి 21) పోలీసు గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరగనుందని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు(కేటీఆర్) ముఖ్య అతిథిగా హజరకానున్నారని సీతార ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే కాగా ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment