లాలా భీమ్లా డీజే వెర్షన్‌ వచ్చేసింది, మామూలుగా లేదుగా.. | Pawan Kalyan Bheema Nayak La La Bheema DJ Version Song Out | Sakshi
Sakshi News home page

Bheemla Nayak: లాలా భీమ్లా డీజే వెర్షన్‌ వచ్చేసింది, మామూలుగా లేదుగా..

Published Fri, Dec 31 2021 7:43 PM | Last Updated on Fri, Dec 31 2021 7:48 PM

Pawan Kalyan Bheema Nayak La La Bheema DJ Version Song Out - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. అయితే జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్‌ ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్‌, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాల కోసం భీమ్లానాయక్‌ విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్మాత కోరడంతో పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోగా పోస్ట్‌పోన్‌ అయింది.

అయితే ఈ న్యూ ఇయర్‌కు పవన్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ఇందులోని హిట్‌ సాంగ్‌ లాలా భీమ్లా నాయక్‌ పాటను డీజే వెర్షన్‌ అందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ రోజు(డిసెంబర్‌ 31)న లాలా భీమ్లానాయర్‌ డీజే వెర్షన్‌ మేకర్స్‌ రిలీజ్‌చేశారు. కాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్‌ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా మ్యూజిక్‌ ఇరగదీస్తున్నాడు. లాలా భీమ్లా నాయక్‌ పాట ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదే పాటను తమన్‌ డీజే వెర్షన్‌గా మలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement