
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశాడు. 'మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. దీని వివరాలను చిత్రనిర్మాణ సంస్థ తెలియజేస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే సోమవారం రాత్రి 8.10 గంటలకు భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజవుతుండగా ఫిబ్రవరి 25న సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment