Pawan Kalyan And Rana Daggubati Bheemla Nayak Movie Release Date Postponed: పవన్ కల్యాణ్-రానాల మల్టిస్టారర్ చిత్రం భీమ్లానాయక్ పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ వాయిదా వేశారు. సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కారణంగానే భీమ్లానాయక్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతి తమ సినిమాను రిలీజ్ చేస్తామని, ఈ విషయంలో తగ్గేదే లే అంటూ పట్టుబట్టిన నిర్మాత నాగ వంశీ దిల్ రాజు కోరిక మేరకు తగ్గినట్టు సమాచారం. కాగా ‘రాధే శ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలు రిలీజ్ కానుండటంతో నిర్మాత దిల్ రాజు.. థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి నిర్మాతలను ఒప్పించారు.
చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత
దీంతో భీమ్లా నాయక్‌ను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సంక్రాంతికి ‘ఆర్‌ఆర్‌ఆర్, రాధే శ్యామ్’ పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే విడుదల కాబోతున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలై ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. దీంతో విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు భీమ్లానాయ్ రిలీజ్ వాయిదా పడటం నిరాశ పరిచిందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment