Is Bheemla Nayak OTT Streaming Rights Sold To AHA And Hotstar For Fancy Price, Deets Inside - Sakshi
Sakshi News home page

Bheemla Nayak OTT Streaming: కళ్లు చెదిరే డీల్‌కు ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 2 సంస్థలు!

Published Sat, Feb 19 2022 6:56 PM | Last Updated on Sun, Feb 20 2022 8:51 AM

Is Bheemla Nayak OTT Rights Sold To AHA, Hotstar For Hefty Price - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల మల్టిస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంతో భీమ్లా నాయక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం ప్రతి కొత్త సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ చిత్రాలు పోస్ట్‌ రిలీజ్‌కు కళ్లు చెదిరే డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అందులో పుష్ప, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే రిలీజ్‌కు ముందే భీమ్లా నాయక్‌ డిజిటల్‌ రిలీజ్‌కు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. మేకర్స్‌ కళ్లు చెదిరే డీల్‌కు భీమ్లా నాయక్‌ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయట. ఫైనల్‌గా ఈ సినిమాను ఆహాతో కలిసి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని చెబుతున్నారు. రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు భీమ్లా నాయక్‌ ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను దక్కించుకున్నాయనే వార్త ఆసక్తిని సంతరించుకుంది.

దీంతో ఈ మూవీ మేకర్స్‌తో భారీగా ఓప్పందం కుదుర్చుకున్నాయని, కళ్లు చేదిరే డీల్‌కు భీమ్లా నాయక్‌ ఓటీటీ రైట్స​ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ థియేటర్లో విడుదలైన 50 లేదా 30 రోజుల తర్వాత ఆహా, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ స్ట్రీమింగ్‌ కానుందని చెబుతున్నారు. కాగా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో నిత్యా మీనన్‌, సంయుక్తి మీనన్‌లుఏ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాని సాగర్‌ కే చంద్ర తెరకెక్కించిన ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement