
టాలీవుడ్‌లోకి నిర్మాత దగ్గుబాటి సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందాడు రానా దగ్గుబాటి. హీరోగానే కాకుండా బావుంటే ఇతర పాత్రల్లోనూ నటించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. బాహుబలి సినిమాలో చేసిన భళ్లాల దేవుడి పాత్రతో ఈయన స్థాయి ఒక్కసారిగా పెరిగింది. ఈ నటుడు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి రీమెక్‌గా రూపొందుతున్న ఈ మూవీకి రానా దాదాపు 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. అది కేవలం 25 రోజుల కాల్షీట్స్‌కి మాత్రమే. ఇది విని ఆయన క్రేజ్ ఇలా పెరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు సినీ జనాలు. అయినా బాహుబలితో రేంజ్ పెరిగిన తరుణంలో ఆ మాత్రం తీసుకునే స్థాయి రానాకు ఉందని ఫిల్మీ దునియాలో చర్చలు జరుగుతున్నాయి.
కాగా, పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, రానా ‘డేనియల్ శేఖర్’ పాత్రల ఫస్ట్‌లుక్స్‌కి, టీజర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా జనవరి 12, 2022న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment