
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'బాద్ షా', 'టెంపర్' వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్ కమ్యునికేషన్ వల్ల అలా జరిగింది. దాన్ని గొడవ అనలేం. ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. కాగా టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్
Varudu Kaavalenu Teaser: అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే
Comments
Please login to add a commentAdd a comment