Bandla Ganesh Latest Shocking Tweet Trending On Twitter, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

Bandla Ganesh: బండ్ల గణేష్‌ షాకింగ్‌ ట్వీట్‌.. ఆ స్టార్‌ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా?

Published Thu, Feb 16 2023 4:29 PM | Last Updated on Thu, Feb 16 2023 6:13 PM

Bandla Ganesh Latest Shocking Tweet Goes Viral - Sakshi

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్‌ తన స్పీచులతోనే సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెడుతుంటాడు. అలా తరచూ తన ట్వీట్స్‌తో ఆటం బాంబ్స్‌ పేలుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది.

ఆయన చేసిన ఈ ట్వీట్‌ ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఉద్దేశించేనా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బండ్ల చేసిన ట్వీట్‌ ఏంటంటే.. ‘మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’ అంటూ ఫైర్‌ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే బండ్ల ఎవరి మీదో ఫుల్‌ ఫైర్‌లో ఉన్నాడని అర్థమవుతుందో.

ఇక ఆయన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు కదా? అన్న అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఆ మధ్య నటుడు పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను పిలవలేదని, దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ తనని మూవీ ఫంక్షన్‌కు రాకుండా అడ్డుకున్నారంటూ బండ్ల గణేష్‌ మాట్లాడినట్టుగా ఓ ఆడియో లీక్‌ కాగా.. అది తనది కాదని బండ్ల అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement