కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక వ్యక్తిని పొగడాలన్నా లేదా విమర్శించాలన్నా.. ట్వీటర్‌ని ఆయుధంగా వాడతారాయన. ఆ మధ్య డైరెక్టర్ హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక తన ట్విటర్ అస్త్రాన్ని త్రివిక్రమ్‌పై ప్రయోగించాడు బండ్లన్న. అయితే అక్కడ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించకపోయినా.. ‘గురుజీ’ అంటూ పరోక్షంగా ఆయన్ను విమర్శించారు.
(చదవండి: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!)
అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్ తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్‌గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇక మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. . ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దీంతో బండ్ల ట్వీట్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023
Comments
Please login to add a commentAdd a comment