Bandla Ganesh Wishes On Vijay Devarakonda Birthday: స్టార్ హీరో విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్బంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజున సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడి విషస్ తెలిపారు. అలాగే బండ్ల గణేశ్ కూడా విజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ విజయ్ స్టార్ అవుతాడని అతడు పుట్టినప్పుడే వాళ్ల నాన్నతో అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్
‘నాకు ఇంకా గుర్తుంది. మే 9న మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. వెంటనే ఆ బాబు స్టార్స్‌తో ఆశీర్వదింపబడ్డాడు అని అన్నాను. డియర్ విజయ్ అన్ని స్టార్స్ కలిసి నిన్ను ఇండియన్ సినిమా సూపర్ స్టార్‌గా నిలబెట్టాయి. హ్యాపీ బర్త్‌డే విజయ్ దేవరకొండ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతుండగా.. మరికొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో విజయ్ తండ్రి టీవీ, సినిమా రంగంలో పనిచేశాడు. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ క్రమంలో విజయ్ తండ్రికి బండ్ల గణేశ్‌తో పరిచయం ఏర్పడి ఉంటుందని నెటిజన్లను అభిప్రాయ పడుతున్నారు.
I still remember that may9th when your dad told me that he’s blessed with a son and immediately replied he’s blessed with a star. Dear Vijay, all the stars are aligned to make you the superstar of indian cinema. 🤗❤️@TheDeverakonda pic.twitter.com/uCKHMlLcBt
— BANDLA GANESH. (@ganeshbandla) May 9, 2022
Comments
Please login to add a commentAdd a comment