Bandla Ganesh Interesting Tweet On Chiranjeevi Goes Viral - Sakshi
Sakshi News home page

Bandla Ganesh: చిరంజీవి సార్‌ మీరు సూపర్‌.. బండ్ల గణేశ్‌ ట్వీట్‌ వైరల్‌

Published Thu, Nov 18 2021 2:46 PM | Last Updated on Thu, Nov 18 2021 3:29 PM

Bandla Ganesh Interesting Tweet On Chiranjeevi - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీపై బండ్ల గణేశ్‌కు ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలిసిందే. మెగా హీరోలపై ఎవరైన వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తే.. బహిరంగంగానే ఇచ్చి పడేస్తాడు. అంతేకాదు సమయం దొరికితే చాలు మెగా హీరోలను, ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచేస్తాడు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. మీరు సూపర్ సార్ అంటూ కామెంట్‌ చేశాడు బండ్ల.

వివరాల్లోకి వెళితే.. బుధవారం అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కళాకారులకు ఏదైనా సహాయం చేయాల్సిందిగా యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేతకు విజ్ఞప్తి చేశాడు.

మెగాస్టార్‌ చిరంజీవి వినయంగా అడగడంతో చలించిపోయిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత.. 'మా' మెంబర్స్ తో పాటు 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే వారందరికి తాము అందించే వైద్యంలో 50 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement