
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా బండ్ల మాట్లాడేటప్పుడు తప్పనిసరి పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన తన దేవుడంటూ కొనియాడుతుంటాడు. ఇటీవల పవన్‌ను బండ్ల కొత్తగా దేవర అని పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ చిన్ననాటి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. పొట్టి నిక్కరు, కాటన్ షర్ట్ ధరించి ఉన్న పవన్ ఫొటోను తాజాగా బండ్ల గణేశ్ షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘ఈ పసివాడే నా దేవర’ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అది చూసి అభిమానులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పవన్‌కు సంబంధించిన ఈ రేర్ పిక్ షేర్ చేసినందుకు బండ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ నుంచి ఇటీవల మేకింగ్ వీడియో బయటకు రాగా అది వైరల్‌గా మారింది. ఇందులో పవన్ పోరాట యుద్ద వీరుడిలా కనిపించనున్నాడు. పవర్ స్టార్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక అభిమానులైతే తమ హీరోని సరికొత్తగా చూడబోతున్నందున ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ పసివాడే నా దేవర @PawanKalyan 🙏 pic.twitter.com/LNly8GzUo1
— BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2021