
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.. బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్‌కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు..ఆయనతో ఎవరు భేటీ అయ్యారు.. అనే కోణంలో అధికారులు తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment